బిగ్ బాష్ లీగ్‌లో ఇవాళ (జనవరి 7) మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆస్టన్ అగర్ (30 బంతుల్లో 51; ఫోర్, 4 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించడంతో స్కార్చర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఆరోన్ హార్డీ (34), ఫిన్ అలెన్ (19), నిక్ హాబ్సన్ (12), జై రిచర్డ్‌సన్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ మార్ష్, కూపర్ కన్నోలి, మాథ్యూ కెల్లీ డకౌట్ అయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ రోజర్స్, సదర్‌ల్యాండ్ తలో రెండు, కేన్ రిచర్డ్‌సన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
తడబడినా నిలబడ్డారు..!
148 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ ఆదిలో తడబడింది. ఆ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (45 బంతుల్లో 70; 5 ఫోర్లు,3 సిక్సర్లు), థామస్ రోజర్స్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.
వీరిద్దరూ ఆరో వికెట్‌కు 92 పరుగులు జోడించి మ్యాచ్‌ను రెనెగేడ్స్ వశం చేశారు. సదర్‌ల్యాండ్, రోజర్స్ దెబ్బకు రెనెగేడ్స్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్, రోజర్స్‌తో పాటు మార్కస్ హ్యారిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు.
రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. టిమ్ సీఫర్ట్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, లారీ ఇవాన్స్ ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. స్కార్చర్స్ బౌలర్లలో జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, జై రిచర్డ్‌సన్, లారీ మోరిస్ తలో రెండు వికెట్లు తీసి రెనెగేడ్స్‌ను ఇబ్బంది పెట్టారు.
26 మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. సిడ్నీ థండర్ (8), హోబర్ట్ హరికేన్స్ (8), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4), మెల్‌బోర్న్ స్టార్స్ (4) వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment