19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు | Renegades won BBL Title | Sakshi
Sakshi News home page

19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు

Feb 17 2019 1:09 PM | Updated on Feb 17 2019 1:12 PM

Renegades won BBL Title - Sakshi

మెల్‌బోర్న్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ విజేతగా అవతరించింది. ఆదివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది రెనిగేడ్స్‌కు తొలి బీబీఎల్‌ టైటిల్‌. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరోన్‌ ఫించ్‌ నేతృత్వలోని రెనిగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రెనిగేడ్స్‌ టాపార్డర్‌ ఘోరంగా విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన టామ్‌ కూపర్‌(43 నాటౌట్‌), ఏడో స్థానంలో వచ్చిన డానియల్‌ క్రిస్టియన్‌(38 నాటౌట్‌)లు ఆదుకున్నారు. దాంతో గౌరవప్రదమైన స్కోరును రెనిగేడ్స్‌ బోర్డుపై ఉంచింది. 

కాగా,ఆపై సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు బెన్‌ డంక్‌(57), మార‍్కస్‌ స్టోనిస్‌(39)లు తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస‍్వామ్యాన్ని అందించి జట్టును పటిష్ట స్థితిలో నిల్పారు. ఆ తర్వాత  ఆడమ్‌ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ప్రధానంగా 19 పరుగుల  వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లను చేజార్చుకుని పరాజయం కొనితెచ్చుకుంది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఓటమి పాలైంది. రెనిగేడ్స్‌ బౌలర్లలో డానియల్‌ క్రిస్టియన్‌, కామెరూన్‌ బోయ్సే, క్రిస్‌ ట్రిమాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement