Tim David Attempts Short Run In BBL 2021: బీబీఎల్ 2021-22లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్.. స్ట్రయిక్‌ని అట్టిపెట్టుకోవడం కోసం క్రీజ్ సగం మధ్య వరకు మాత్రమే పరిగెత్తి రెండో పరుగు కోసం వెనక్కు వెళ్లాడు. నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో నాథన్ ఎల్లీస్‌కు స్ట్రయిక్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్ రన్ తీసినట్టు నిర్ధారణ కావడంతో అంపైర్లు హోబర్డ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు.
Stars will start their innings with 5 free runs courtesy of this... #BBL11 pic.twitter.com/lz9tRxNLLB
— KFC Big Bash League (@BBL) December 24, 2021
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. సాధారణంగా షార్ట్ రన్ అంటే.. క్రీజ్ దగ్గరి దాకా వెళ్లి పొరపాటున రెండో పరుగు కోసం తిరిగి వెళ్లడం. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో అలా జరగలేదు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మాట్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం 181 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
చదవండి: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment