బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్‌లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి.
THE GREATEST CHASE!
— KFC Big Bash League (@BBL) January 5, 2023
Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history!
Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY
మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు.
You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa
— KFC Big Bash League (@BBL) January 5, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment