Chris Lynn
-
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్‌తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్‌కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్‌లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్‌కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
విండీస్ ఆటగాడి ఒంటరి పోరాటం.. 5 వికెట్లతో చెలరేగిన అఫ్రిది
గ్లోబల్ టీ20 కెనడా లీగ్-2023లో భాగంగా వాంకోవర్ నైట్స్‌తో నిన్న (ఆగస్ట్ 5) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మాంట్రియాల్ టైగర్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో రెండో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో మాంట్రియాల్ టైగర్స్.. సర్రే జాగ్వార్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదేసిన అఫ్రిది.. క్వాలిఫయర్స్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. అబ్బాస్ అఫ్రిది (4-0-29-5) ధాటికి నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. అఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగగా.. అయాన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. వాంకోవర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (33 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్), కోర్బిన్ బోష్ (28 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు) హర్ష్ ధాకర్ (21 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేయగా.. కెప్టెన్ వాన్ డర్ డస్సెన్, నజీబుల్లా గోల్డెన్ డకౌట్లయ్యారు. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్.. 138 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ అతి కష్టం మీద 9 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విండీస్ ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (34 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరిపోరాటం చేసి మాంట్రియాల్‌ను గెలిపించాడు. అతనికి దీపేంద్ర సింగ్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు), ఆండ్రీ రసెల్ (11 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు), అయాన్ అఫ్జల్ (14 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) సహకరించారు. వీరు మినహా జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వాంకోవర్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఫేబియన్ అలెన్, కోర్బిన్ బోష్ తలో 2 వికెట్లు, రూబెన్ ట్రంపెల్మెన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్‌వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్ లీగ్‌లో చారిత్రక విజయం
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్‌గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్‌లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గల్లీ క్రికెట్‌లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్ లిన్ నార్తంప్టన్‌షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న లిన్.. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్ లిన్ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్టన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్ లిన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్ బెన్ కరన్(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్ నీషమ్ తోడయ్యాడు. ఐపీఎల్ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. 30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్ స్టీల్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! A special innings from a special player @lynny50 💯 #Blast22 | @NorthantsCCC pic.twitter.com/NImOepuOHU — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
'ముంబై జట్టులో విభేదాలు.. అందుకే ఈ ఓటములు'
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సీజన్లో వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ లిన్ సంచలన వాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో అంతరర్గత విభేదాలున్నాయాని, అందుకే జట్టు వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతుందని క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు. "ముంబై జట్టుకు గెలవడం,ఓడిపోవడం రెండూ అలవాటే. ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమస్యలు ఉన్నాయి. వారి డ్రెస్సింగ్ రూంలో గ్రూపులు ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో ముంబై జట్టు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది. అది జట్టుకు మంచి సంకేతం కాదు. కాగా కెప్టెన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పొలార్డ్ వంటి సీనియర్ రోహిత్‌కు సాయంగా ఉండాలి. కానీ జట్టులో అది కనిపించడంలేదు అని క్రిస్ లిన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్ వివాదంలో ఆసక్తికర చర్చ -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
'షార్ట్ వేసుకుందామనుకున్నా.. కానీ మాల్దీవ్స్‌లో లేను'
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఆ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అందరూ వ్యాక్సినేషన్ వేసుకునే పనిలో పడ్డారు. ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేయడంతో క్రికెటర్లు కూడా వ్యాక్సిన్ వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోహ్లి, రహానే, శిఖర్ ధావన్, పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా ఆటగాళ్లంతా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా దినేష్ కార్తీక్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. అయితే కార్తీక్ తాను షేర్ చేసిన ఫోటోలో అతని ప్యాంటు కాస్త కనిపించి కనిపించనట్టుగా ఉంది.. అచ్చం ఆర్మీ అధికారులు వేసుకునే ప్యాంటులాగా ఉంది. కార్తీక్ ఫోటోను ట్యాగ్‌ను చేస్తూ ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ ట్రోల్ చేశాడు. ''కార్తీక్ కాస్త మంచిగా కనిపించే ప్యాంటు వేసుకోవచ్చుగా'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి కార్తీక్ తనదైన శైలిలో ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ''నిజమే లిన్.. అసలు మొదట షార్ట్ వేసుకొని వ్యాక్సిన్ వేసుకోవాలనుకున్నా.. కానీ నేను మాల్దీవ్స్‌లో లేను.. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని ఈ ప్యాంటు వేసుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. కార్తీక్, లిన్ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. క్రిస్ లిన్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్లో లిన్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు. సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో లిన్ 48 పరుగులు చేశాడు. అయితే డికాక్ రాకతో లిన్‌కు తుది జట్టులో అవకాశం లభించలేదు. ఇక కార్తీక్ కేకేఆర్ తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు సాధించాడు. చదవండి: కెప్టెన్‌గా పంత్.. కోహ్లి, రోహిత్‌లకు దక్కని చోటు 'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు' Could have at least worn pants — Chris Lynn (@lynny50) May 11, 2021 I was thinking shorts like you , then realised I'm not in Maldives . So wore this 😂 — DK (@DineshKarthik) May 11, 2021 -
ఐపీఎల్ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం
కాన్బెర్రా: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం వేయాలని కోరిన ఆ దేశానికి చెందిన క్రిస్ లిన్ విజ్ఞప్తికి చుక్కెదురైంది. ఈ విషయంలో తాము ఎటువంటి సాయం చేయలేమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెగేసి చెప్పారు. ఐపీఎల్లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్‌గా ప్రయాణించారని, ఇదేమే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు. ఆసీస్ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడిన మోరిసన్.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ‘ వారు(ఆసీస్ క్రికెటర్లు) ప్రైవేట్‌గా భారత్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్‌కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారుకున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే.... వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా’ అని తెలిపారు. ఇక్కడ చదవండి: మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి ఇంత ఖర్చుతో ఐపీఎల్ అవసరమా?: రాజస్థాన్ ఆటగాడు -
మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి
ఢిల్లీ: తమకు వచ్చేవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ స్ప‘ష్టం చేశాడు. ఈ విషయాన్ని మంగళవారం న్యూకార్పోరేషన్ మీడియాకు తెలిపిన లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు చార్టర్ ప్లేన్ వేయమని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తామంతా(ఆస్ట్రేలియా క్రికెటర్లు) క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు చార్టర్ విమానాన్ని వేయమని కోరినట్లు తెలిపాడు. ‘సీఏకు టెక్స్ట్ మెసేజ్ చేశాను. ప్రతీ ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ డబ్బును మాకు చార్టర్ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నా. మా కంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కఠినమైన బయోబబుల్‌లో ఉంటున్నాము. వచ్చేవారం వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నా. మేము షార్ట్ కట్లు గురించి అడగడం లేదు. మేము సంతకాలు చేసేటప్పుడే రిస్క్ తెలుసుకునే చేశాం. ఈ మెగా టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత కంటే మంచిది మరొకటి ఉండదు’ అని లిన్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియా క్రికెటర్, కేకేఆర్ సభ్యుడు ప్యాట్ కమిన్స్ .. పీఎం కేర్స్‌కు 50వేల యూఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.భారత్‌లో కరోనా రోగులకు ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉన్న కారణంగా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు. అదే సమయంలో ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మిగిలిన ఆసీస్ క్రికెటర్లను కూడా సాయం చేయాలని కోరాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం నాటికి కోవిడ్ కేసుల అప్డేట్ విడుదల చేసే సమయానికి గత 24 గంటల్లో 3, 23,144 కొత్త కేసులు నమోదు కాగా, 2,771 మృత్యువాత పడ్డారు. -
రనౌట్: ఏమో.. ఇదే నాకు చివరి మ్యాచ్ కావొచ్చు!
చెన్నై: గత ఐపీఎల్ సీజన్లో జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం పొందలేకపోయాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్. అయితే, ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్ యజువేంద్ర చహల్ వేసిన 4వ ఓవర్ చివరి బంతిని క్రిస్ లిన్ కవర్స్ ఫ్లిక్ చేయగా, నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో చురుగ్గా కదిలిని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి బంతిని చహల్‌కు త్రో వేయగా, వెనువెంటనే వికెట్లకు గిరాటేయడంతో హిట్‌మ్యాన్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిస్ లిన్ మాట్లాడుతూ.. ‘‘మొదటి మ్యాచ్ అది కూడా రోహిత్‌తో కలిసి ఆడనుండటంతో తొలుత కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. నిజానికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ అవకాశం ఉంటే కెప్టెన్ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని. ఏదేమైనా ఇలా జరగకుండా ఉండాల్సింది. తప్పిదం జరిగిపోయింది. ఒకవేళ రోహిత్ క్రీజులో ఉంటే ఇంకొన్ని పరుగులు చేసేవాడేమో. మ్యాచ్ ఫలితం కూడా వేరేలా ఉండేది కావొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా, శుక్రవారం నాటి మ్యాచ్‌లో క్రిస్‌లిన్ 35 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్ ఇచ్చేవాళ్లం.. కౌంటర్ పడిందిగా! ఒక కెప్టెన్‌గా ఏం ఆశించానో.. అదే చేశాడు : కోహ్లి -
అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు.. కానీ
చెన్నై: భుజం నొప్పి కారణంగానే తమ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడని ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్‌లిన్ అన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా తన సేవలు జట్టుకు ఎంతో ముఖ్యమని, బౌలింగ్ చేసే క్రమంలో నొప్పి ఎక్కువైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పూర్తిగా కోలుకున్న తర్వాత బంతితో మ్యాజిక్ చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్-2021 బరిలో దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లోనే అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రెండు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో క్రిస్ లిన్(49) మినహా మిగతా వాళ్లెవరూ రాణించకపోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమై కోహ్లి సేనకు మ్యాచ్ సమర్పించుకుంది. ఇక సమన్వయ లోపం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ కావడం, స్టార్ ప్లేయర్‌గా పేరొందిన హార్దిక్ పాండ్యా కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారీ మూల్యమే చెల్లించింది. కాగా ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రిస్ లిన్ మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌కు భుజం నొప్పి ఉన్న కారణంగానే బౌలింగ్ సేవలు వినియోగించులేకపోయాం. ఈరోజు మ్యాచ్‌లో మేం ఆరో బౌలర్‌ను మిస్ కావచ్చు. ఆరంభ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయడం కుదరకపోవచ్చు. కానీ టోర్నీ మొత్తం తను దాదాపు 14 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. తను కోలుకున్నట్లయితే మాకు అదనపు బలం చేకూరుతుంది. తను బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతం చేయగలడని నేను విశ్వసిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. చదవండి: వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది -
టి20 ప్రపంచకప్ జరగకపోవడమే మంచిది: లిన్
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ సూచించాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జట్లకు వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తలనొప్పిగా మారుతుందన్నాడు. ‘మేమంతా టోర్నీ జరగాలనే ప్రార్థిస్తాం. పోటీల్లో తలపడాలని ఆశిస్తాం. కానీ ఇçప్పుడైతే మనముందున్న సవాళ్లతో ఆడాల్సి ఉంది. టోర్నీకి చాలా రోజుల ముందు జట్లను రప్పించి క్వారంటైన్, హోటళ్లలో బస, ప్రయాణ సదుపాయాలు కల్పించడం అంత సులువేం కాదు’ అని లిన్ వివరించాడు. -
ఫ్యాన్స్ షాక్: క్రిస్ లిన్ నెత్తిపై పొగలు
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వసంకర క్రికెటర్ క్రిస్ లిన్‌కు కోపం వచ్చింది.. మైదానంలోనే సహచర ఆటగాళ్లపై మండిపడ్డాడు.. ఆ వెంటనే అతడి నెత్తిపై నుంచి పొగలు వచ్చాయి. ఈ విచిత్ర ఘటన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కనిపించింది. శుక్రవారం రావల్పిండి వేదికగా పెషావర్ జల్మి-లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్ నెత్తిపై పొగలు రావడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే కొందరు ఫ్యాన్స్ అవాక్కవుతుండగా.. మరికొందరు కెమెరా జిమ్మిక్కు కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే కెమెరా పనితనం ఏమి లేదని, పొగలు వచ్చిన మాట వాస్తవమని, దానికి కారణాలు తెలియవని ఈ విచిత్ర ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ అభిమాని పేర్కొన్నాడు. (చదవండి: ‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) ఇక ఈ మ్యాచ్‌లో క్రిస్ లిన్ ప్రాతినిథ్యం వహించిన లాహోర్ ఖలందర్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనపై క్రిస్ లిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే అతడి నెత్తిపై పొగలు వచ్చాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులే సాధించి ఓటమి పాలైంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రిస్ లిన్ మెరుపుల గురించి తెలియన వారు ఉండరు. గత సీజన్ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. రానున్న సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7 — Mazher Arshad (@MazherArshad) February 28, 2020 చదవండి: కోహ్లి.. అందుకే విఫలం కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా? -
మళ్లీ లిన్ మోత మోగించాడు..
హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్షాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్‌గా మిగిలాడు. ఆపై టార్గెట్‌ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) -
‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పించ్ హిట్టర్లలో క్రిస్ లిన్ ఒకడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ హార్డ్ హిట్టర్. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై దక్కించుకుంది. క్రిస్ లిన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు లిన్. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లిన్.. ఈ లీగ్‌లో కొట్టే ప్రతీ సిక్స్‌ను ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ బాధితులకు డొనేట్ చేస్తానంటున్నాడు. ‘ హే గయ్స్.. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో నేను కొట్టే ప్రతీ సిక్స్‌కు 250 డాలర్లను వారికి సాయంగా అందిస్తా. ఒక్కో సిక్స్‌కు 250 డాలర్లను ఇవ్వాలనుకుంటున్నా’ అని లిన్ ట్వీట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా తన వంతు సాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఏటీపీ కప్‌లో తాను కొట్టే ప్రతీ ఏస్‌కు 200 డాలర్లను ఇస్తానని తెలిపాడు. మరొక ఆసీస్ టెన్నిస్ ప్లేయర్ అలెక్స్ డి మినార్ కూడా ప్రతీ ఏస్‌కు 250 డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. కాకపోతే తాను ఎక్కువ ఏస్‌లు కొట్టలేనేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్ స్టార్లు, టెన్నిస్ స్టార్లు కలిసి తమ దేశంలోని అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ వారికి సాయం చేయడానికి నడుం బిగించారు. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో 17 మంది మ్యత్యువాడ పడగా వందల సంఖ్యలో గాయపడ్డారు.(ఇక్కడ చదవండి: క్రిస్ లిన్‌కు జాక్‌పాట్ లేదు..!) -
క్రిస్ లిన్‌కు జాక్‌పాట్ లేదు..!
కోల్‌కతా: ఈసారి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ కనీస ధరకే అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. క్రిస్ లిన్‌పై మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపెట్టకపోవడంతో అతను కనీస ధరకే పరిమితమయ్యాడు. ఈ వేలంలో లిన్‌కు అత్యధిక ధర పలుకుతుందని ఊహించనప్పటికీ లిన్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కోత్ నైట్ రైడర్స్ కూడా తమ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్‌ను వదిలేసుకుంది. క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్ వదిలేసుకుందనేది కాదనలేని వాస్తవం. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్ సాధించాడు. మరాఠా అరేబియన్స్ తరుఫున లిన్ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అయినప్పటికీ లిన్ కోసం పెద్దగా పోటీ లేకుండా పోయింది. ఇక్కడ ముంబై ఇండియన్స్ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేయడంతో జాక్‌పాట్ కొట్టిందనే చెప్పాలి. -
‘అతడ్ని వదిలేశాం.. నిన్ను తీసుకుంటాం’
హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ హిట్టర్ క్రిస్ లిన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ వేలంలోకి విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెదవివిరిచిన విషయం తెలిసిందే. ఇది చెత్త నిర్ణయమంటూ విమర్శించాడు. అయితే యువీ విమర్శలపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ ఫన్నీగా స్పందించాడు. ‘యువరాజ్ సింగ్ మేము హిట్టర్ క్రిస్ లిన్‌ను వదిలిపెట్టాం. దీంతో కేకేఆర్ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్ వేయవచ్చు!. ఇద్దరు చాంపియన్ల(లిన్, యువీ)పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది’అంటూ కేకేఆర్ సీఈఓ ట్వీట్ చేశాడు. ‘క్రిస్‌లిన్‌ని కేకేఆర్ ఎందుకు రిటైన్ చేసుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడిని వేలంలోకి వదిలేయడమనేది కేకేఆర్ తీసుకున్న చెత్త నిర్ణయం. ఈ విషయమై కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్‌కి మెసేజ్ చేస్తా’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. దీంతో క్రిస్ లిన్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి వంటి ఖరీదైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్నాయి. -
అది కేకేఆర్ బ్యాడ్ కాల్: యువరాజ్
న్యూఢిల్లీ: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. దాంతో కోల్‌కోత్ నైట్ రైడర్స్ కూడా తమ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్‌ను వదిలేసుకుంది. క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్ వదిలేసుకుందనేది కాదనలేని వాస్తవం. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్ సాధించాడు. మరాఠా అరేబియన్స్ తరుఫున లిన్ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. లిన్ తాజా ప్రదర్శనతో కేకేఆర్ చింతించడం ఖాయం. అయితే కేకేఆర్ ఫ్యాన్స్‌కు లిన్‌ను వదిలేయడం అమితంగా బాధిస్తోంది. హార్డ్ హిట్టర్ అయిన లిన్‌ను రిలీజ్ చేయడంతో ఆ ఫ్రాంఛైజీ అభిమానుల్ని షాక్ గురి చేసింది. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం వ్యక్తం చేశాడు. లిన్‌ను వదిలేయడం కేకేఆర్ బ్యాడ్ కాల్‌గా అభివర్ణించాడు. ఇది తనకు ఓ జోక్‌గా అనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని అసలు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ తెలియజేశారో,లేదో అంటూ యువరాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒకవేళ షారుఖ్ కూడా అతని వదిలేయడానికి ఇష్టపడితే అప్పుడు రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదన్నాడు. ‘ నేను చూసిన ఐపీఎల్లో లిన్ ఒక ప్రత్యేక ఆటగాడు. కేకేఆర్‌కు ఎన్నో సందర్భాలు మంచి ఆరంభాలు ఇచ్చాడు. అసలు అతన్ని ఎందుకు అంటిపెట్టుకోలేదో నాకైతే కచ్చితంగా తెలియదు. నా వరకూ అయితే అది కేకేఆర్ తప్పుడు నిర్ణయం. దీనిపై షారుఖ్‌కు మెస్సేజ్ ఉందా. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో లిన్ అసాధారణ ఆటగాడు’ అని యువీ పేర్కొన్నాడు. ఇక విదేశీ లీగ్‌లో ఆడటంపై యువీ సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే రెండు-మూడేళ్లలో మరిన్ని లీగ్‌లు రాబోతున్నాయని, వాటిలో ఆడటం చూస్తున్నట్లు యువీ తెలిపాడు. ఒక ఏడాది మొత్తంగా ఆడేకంటే రెండు-మూడు నెలలు క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నానని యువీ పేర్కొన్నాడు. -
మళ్లీ సీఎస్కేదే విజయం
కోల్‌కతా: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది. ఫలితంగా ఏడో విజయాన్ని కోల్‌కతా ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ సీజన్లో కేకేఆర్‌తో జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనే సీఎస్కేదే పైచేయి అయ్యింది. తాజా మ్యాచ్‌లో సురేశ్ రైనా(58 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, రవీంద్ర జడేజా(31 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఇక చెన్నై జట్టులో డుప్లెసిస్(24), కేదార్ జాదవ్(20)లు ఫర్వాలేదనిపించగా, ఎంఎస్ ధోని(16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా తలో రెండు వికెట్లు సాధించగా, గర్నీ వికెట్ తీశాడు. అంతకుముందు కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ సునీల్ నరైన్(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్ క్రిస్ లిన్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్ డౌన్లో వచ్చిన నితీశ్ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్ ఊతప్ప గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. క్రిస్ లిన్ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్(10), దినేశ్ కార్తీక్(18), శుభ్‌మన్ గిల్(15)సైతం విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకుని కేకేఆర్‌ను కట్టడి చేశారు.ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్‌కు వికెట్ దక్కింది. -
కేకేఆర్‌ను కట్టడి చేశారు..
కోల్‌కతా: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 162 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ సునీల్ నరైన్(2) నిరాశ పరిచాడు. కాగా, మరో ఓపెనర్ క్రిస్ లిన్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.అయితే ఫస్ట్ డౌన్లో వచ్చిన నితీశ్ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్ ఊతప్ప గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. క్రిస్ లిన్ మాత్రం 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 82 పరుగులు సాధించిన తర్వాత నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎవరూ రాణించకపోడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆండ్రీ రసెల్(10), దినేశ్ కార్తీక్(18), శుభ్‌మన్ గిల్(15)సైతం విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకుని కేకేఆర్‌ను కట్టడి చేశారు. కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లతో మెరవగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించాడు. సాంట్నార్‌కు వికెట్ దక్కింది. డుప్లెసిస్ నాలుగు క్యాచ్‌లు పట్టడం విశేషం. -
బెయిల్స్ పడకపోతే ఫోర్ ఇస్తారా?
జైపూర్ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించిన కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా.. ఓపెనర్లు సునీల్ నరైన్(47), క్రిస్ లిన్(50) చెలరేగడంతో 37 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్బంగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. క్రిస్‌లిన్ బ్యాటింగ్ చేస్తుండగా ధవల్ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతి.. వికెట్లను తాకింది. కానీ బెయిల్స్ కిందపడలేదు. విచిత్రంగా ఆ బంతి బౌండరీ వెళ్లింది. దీంతో క్రిస్‌లిన్ బతికిపోగా.. కోల్‌కతా నాలుగు పరుగులు లభించాయి. అయితే అంపైర్ ఫోర్ ఇవ్వడంపై మైదానంలోనే కెప్టెన్ అజింక్యా రహానే అభ్యంతరం చెప్పాడు. అంపైర్లతో చర్చించాడు. ఇక మ్యాచ్ అనంతరం అంపైర్లతో తాను జరిపిన సంభాషణ గురించి వివరణ ఇచ్చాడు. బంతి వికెట్లను తాకి బౌండరీ వెళ్తే ఎలా ఫోర్ ఇస్తారని ప్రశ్నించాడు. కనీసం దాన్ని డెడ్బాల్గానైనా ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘నిబంధనలు..నిబంధనలే. కనీసం ఫోర్ అన్నా ఇవ్వకండని అంపైర్లకు చెప్పాను. ఇప్పటికే టీ20 ఫార్మాట్ బౌలర్లకు కష్టంగా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనైనా బౌలర్స్‌కు ఫేవర్‌గా ఆ బంతిని డేడ్ బాల్ ఇవ్వాలని అంపైర్లను కోరాను’ అని రహానే వివరించాడు. ఇక క్రిస్‌లిన్ ఆ సమయంలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దొరికిన ఈ అవకాశంతో చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనపై స్పందిస్తూ.. తాను చాలా అదృష్టవంతుడినంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఘటనపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కింగ్స్ పంజాబ్-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి బెయిల్స్ కిందపడలేదు. దీంతో కేఎల్ రాహుల్‌కు లైఫ్ లభించింది. -
‘చెక్ చేయండిరా బాబు.. నమ్మలేకపోతున్నాం’
జైపూర్ : ఐపీఎల్ సీజన్12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించి కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా ఓపెనింగ్ జోడి (నరైన్- క్రిస్‌లిన్)ని విడదీసేందుకు రాయల్స్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ లిన్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్’ కారణంగానే అతనికి లైఫ్ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఛేజింగ్‌లో భాగంగా నరైన్‌తో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన క్రిస్ లిన్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్ ధవల్ కులకర్ణి నాలుగో ఓవర్ రెండో బంతి(ఇన్సైడ్ ఎడ్జ్) ద్వారా లిన్ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్ క్రిస్‌లిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్తో బెయిల్స్‌ను అంటించారేమో. స్టంప్స్‌ను బాల్ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కులకర్ణి బౌలింగ్‌లో లైఫ్ పొందిన క్రిస్‌లిన్.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో లిన్ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. Does someone want to check if the bails have been glued down? Never seen a ball hit the stumps that hard and not knock the bails off - unbelievable!#RRvKKR #HallaBol #IPL #IPL12 #ipl2019 #cricket pic.twitter.com/TLqshZ7Kvz — talesfrmthecrypt (@cricketwriter1) April 7, 2019 #RRvKKR #IPL2019 #BCCI #ICC #VIVOIPL What's point of inbuilt LEDs stumps/bails.. Even if the bails don't get dislodged the blink of LEDs should be taken into consideration.. pic.twitter.com/DJ0gDDDpI7 — Saurabh Trivedi (@saurabh7755) April 7, 2019