
మెల్‌బోర్న్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ సూచించాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జట్లకు వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తలనొప్పిగా మారుతుందన్నాడు. ‘మేమంతా టోర్నీ జరగాలనే ప్రార్థిస్తాం. పోటీల్లో తలపడాలని ఆశిస్తాం. కానీ ఇçప్పుడైతే మనముందున్న సవాళ్లతో ఆడాల్సి ఉంది. టోర్నీకి చాలా రోజుల ముందు జట్లను రప్పించి క్వారంటైన్, హోటళ్లలో బస, ప్రయాణ సదుపాయాలు కల్పించడం అంత సులువేం కాదు’ అని లిన్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment