
కోలకతా నైట్‌రైడర్స్ లోగో
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నాయకత్వ బాధ్యతలు ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు దక్కనున్నాయా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అవకాశం వస్తే నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహిస్తానని సోమవారం క్రిస్ లిన్ ప్రకటించడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఐపీఎల్-2017లో మెరుపు ఇన్నింగ్స్‌లతో క్రిస్‌లిన్ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. దీంతో వేలంలో రూ. 9.6కోట్ల భారీ మొత్తానికి లిన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
నైట్‌రైడర్స్‌కు అత్యధిక కాలం పాటు నాయకుడిగా వ్యవహరించిన గంభీర్‌ని వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. గంభీరే తన కోసం బిడ్ చేయొద్దని కోరాడని ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ కెప్టెన్ వేటలో పడింది.
తొలుత ఉతప్పకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావించింది. అయితే, ఇప్పుడు క్రిస్‌లిన్ వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment