న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న విధ్వంసక ఆటగాడు, న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెకల్లమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అసిస్టెంట్ కోచ్‌గా రానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. గతంలో కేకేఆర్‌కు ఆడిన ఆనుభవం ఉపయోగపడుతుందని ఆ జట్టు యాజమాన్యం విశ్వసిస్తోంది.
ఐపీఎల్‌తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు హెడ్ కోచ్‌గా కూడా మెకల్లమ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్ అనంతరం కేకేఆర్ హెడ్ కోచ్‌గా పనిచేసిన దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు జాక్వస్ కలిస్‌ను, అతని డిప్యూటీ అయిన సైమన్ కటిచ్‌ను యాజమాన్యం తప్పించింది.
ఐపీఎల్ తొలి సీజన్‌లో మెక్‌కలమ్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 158 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఐదు సీజన్లలో కేకేఆర్ తరఫున ఆడిన అతడు 2009లో నాయకుడిగా జట్టును నడిపించాడు. ఇప్పుడు తిరిగి అదే జట్టుకు అస్టిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment