ముంబై: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఆ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అందరూ వ్యాక్సినేషన్ వేసుకునే పనిలో పడ్డారు. ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేయడంతో క్రికెటర్లు కూడా వ్యాక్సిన్ వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోహ్లి, రహానే, శిఖర్ ధావన్, పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా ఆటగాళ్లంతా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా దినేష్ కార్తీక్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. అయితే కార్తీక్ తాను షేర్ చేసిన ఫోటోలో అతని ప్యాంటు కాస్త కనిపించి కనిపించనట్టుగా ఉంది.. అచ్చం ఆర్మీ అధికారులు వేసుకునే ప్యాంటులాగా ఉంది. కార్తీక్ ఫోటోను ట్యాగ్‌ను చేస్తూ ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ ట్రోల్ చేశాడు.
''కార్తీక్ కాస్త మంచిగా కనిపించే ప్యాంటు వేసుకోవచ్చుగా'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి కార్తీక్ తనదైన శైలిలో ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ''నిజమే లిన్.. అసలు మొదట షార్ట్ వేసుకొని వ్యాక్సిన్ వేసుకోవాలనుకున్నా.. కానీ నేను మాల్దీవ్స్‌లో లేను.. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని ఈ ప్యాంటు వేసుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. కార్తీక్, లిన్‌ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 14వ సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. క్రిస్ లిన్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్‌లో లిన్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు. సీజన్ తొలి మ్యాచ్ ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో లిన్ 48 పరుగులు చేశాడు. అయితే డికాక్ రాకతో లిన్‌కు తుది జట్టులో అవకాశం లభించలేదు. ఇక కార్తీక్ కేకేఆర్ తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు సాధించాడు.
చదవండి: కెప్టెన్‌గా పంత్.. కోహ్లి, రోహిత్‌లకు దక్కని చోటు
'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు'
Could have at least worn pants
— Chris Lynn (@lynny50) May 11, 2021
I was thinking shorts like you , then realised I'm not in Maldives . So wore this 😂
— DK (@DineshKarthik) May 11, 2021
Comments
Please login to add a commentAdd a comment