బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు.
దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్‌మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది.
Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11
— Fox Cricket (@FoxCricket) December 29, 2021
This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0
Comments
Please login to add a commentAdd a comment