ఐపీఎల్-10: క్రిస్ లిన్ వచ్చేశాడోచ్!
ఐపీఎల్-10: క్రిస్ లిన్ వచ్చేశాడోచ్!
Published Wed, May 3 2017 5:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
న్యూ ఢిల్లీ: ఐపీఎల్-10లో భుజ గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమైన క్రిస్ లిన్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ లీన్ ఈ సీజన్ లో అత్యంత వేగంగా 19 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తొలి అర్ధ భాగంలో ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ లిన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ గాయం తీవ్రం కావడం, ఇప్పటికే మూడు సార్లు అదే భుజానికి గాయం అవ్వడంతో ఐపీఎల్ సీజన్ కు దూరం అవుతాడని అందరూ భావించారు. కానీ క్రిస్ లిన్ మంగళవారం కోల్ కతా జట్టు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. చాలా దృఢంగా కనిపించిన లిన్ భుజానికి పట్టీలతోనే ప్రాక్టీస్ చేశాడు. క్రిస్ లిన్ ఆడిన రెండు మ్యాచుల్లో ఓపెనర్ గా 125 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇందులో గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో క్రిస్ లిన్ వేగమైన అర్ధ సెంచరీ (93) నమోదు చేయడంతో గుజరాత్ పై కోల్ కతా 10 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇక గాయంతో లిన్ దూరమవ్వడంతో అతని స్థానంలో ఒపెనర్ గా స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ ను ప్రయోగించి కోల్ కతా విజయం సాధించింది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వైబ్ సైట్ లో కేకేఆర్ అభిమానులు క్రిస్ లిన్ రాక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని, మే 9న కింగ్స్ పంజాబ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండగలడని పేర్కొంది. ఇక క్రిస్ లిన్ రాకతో కోల్ కతా జట్టుకు బలం చేకూరనుంది. భుజగాయం నెమ్మదిగా తగ్గుతుందని, గాయమైన మరుసటి రోజు ఇంజక్షన్ తీసుకున్నానని, అది బాగా పనిచేసిందని క్రిస్ లిన్ క్రికెట్.కామ్.ఏయూ లో పేర్కొన్నాడు.
Advertisement
Advertisement