ILT20 2023: Gulf Giants beat Desert Vipers to clinch inaugural title - Sakshi
Sakshi News home page

ILT20 2023 Winner: ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 తొలి చాంపియన్‌గా అదానీ గ్రూప్‌ జట్టు

Published Mon, Feb 13 2023 10:20 AM | Last Updated on Mon, Feb 13 2023 10:53 AM

ILT20 2023: Gulf Giants Beat Desert Vipers Clinch Inaugural Title - Sakshi

ఐఎల్‌ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్‌ జట్టు(PC: Gulf Giants Twitter)

International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20(ఐఎల్‌టీ20) మొదటి ఎడిషన్‌ విజేతగా గల్ఫ్‌ జెయింట్స్‌ అవతరించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్‌ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్‌ ఆటగాడు కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

నెల రోజుల పాటు సాగిన టోర్నీ
ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్‌ క్యాపిటల్స్‌- అబుదాబి నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్‌టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్‌, షార్జా వారియర్స్‌, డెజర్ట్‌ వైపర్స్‌ సహా గల్ఫ్‌ జెయింట్స్‌ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి.

ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్‌ వైపర్స్‌- గల్ఫ్‌ జెయింట్స్‌ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో టాస్‌ గెలిచిన గల్ఫ్‌ జెయింట్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

చెలరేగిన బ్రాత్‌వైట్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్‌ పతనాన్ని శాసించాడు.

ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్‌ అహ్మద్‌ రెండు, క్రిస్‌ జోర్డాన్‌ ఒక వికెట్‌ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు.

క్రిస్‌ లిన్‌ అద్భుత ఇన్నింగ్స్‌
ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్‌ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్‌మెయిర్‌ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్‌ జెయింట్స్‌ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్‌ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్‌టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్‌ జెయింట్స్‌ అదానీ స్పోర్ట్స్‌లైన్‌కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే.

ఐఎల్‌టీ20 ఫైనల్‌: డెజర్ట్‌ వైపర్స్‌ వర్సెస్‌ గల్ఫ్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ స్కోర్లు
డెజర్ట్‌ వైపర్స్‌- 146/8 (20) 
గల్ఫ్‌ జెయింట్స్‌- 149/3 (18.4)

చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్‌’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్‌
Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement