Gulf Giants
-
గల్ఫ్‌లో భారీ ‘క్రెడిట్’ స్కాం.. విషయం తెలిస్తే షాక్!
నిజామాబాద్: గల్ఫ్ ఏజెంట్లు నయా స్కాంకు తెరలేపారు. గతంలో కొందరు నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసేవారు. మరికొందరు విజిట్ వీసాపై పంపించి.. పనిచూపించకుండా.. వర్క్ పర్మిట్ ఇప్పించకుండా మోసం చేసేవారు. తాజాగా కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. వీసాలు ఇప్పించి దుబా య్కు పిలిపించుకుని కొన్ని రోజుల పాటు తమ వద్ద ఉంచుకొని.. వీరి పేర్ల మీద క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకొని వారిని తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంక్ సిబ్బంది ఈఏంఐలు చెల్లించాలని బెదిరింపులకు దిగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో తాము తీసుకోని రుణాలకు ఈఎంఐ లు ఎలా చెల్లిస్తామని బాధితులు మంగళవారం పోలీస్‌కమిషనర్ కల్మేశ్వర్‌ను ఆశ్రయించారు. స్పందించిన సీపీ వెంటనే విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్‌రాజును ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. దుబాయ్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రతినెలా రూ. 40వేల నుంచి రూ. 50వేల వేతనంతో పాటు రూ. 50 లక్షల క్రెడిట్ కార్డు సౌకర్యం ఉంటుందని జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌కు చెందిన ఏజెంట్ పబ్బ భూమేశ్ అలియాస్ దండిగాళ్ల భూమేశ్ అలియాస్ భూమారెడ్డి సబ్ ఏజెంట్లను నమ్మబలికాడు. దీంతో డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన భోజారాం మరో ఇద్దరు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు చెందిన 82 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 6లక్షల చొప్పున వీసాకు వసూలు చేశారు. వీరి నుంచి వసూలు చేసిన సుమారు రూ. 5కోట్లను దఫాల వారీగా పబ్బ భూమేశ్ సూచించిన వారికి చెల్లించారు. డొంకేశ్వర్ మండలం అన్నారంనకు చెందిన భోజారం నిజామాబాద్‌లోని శ్రీదేవి ట్రావెల్స్‌కు చెందిన బెజ్జం సుబ్బారెడ్డికి రూ. 2కోట్లను చెల్లించాడు. వెంటనే డబ్బులు చెల్లించినట్లు భోజారాం పబ్బ భూమేశ్‌కు వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ చేశారు. తర్వాత ఆర్మూర్‌కు చెందిన అరెపల్లి మోహన్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు రూ. 3కోట్లు భోజారం చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వీరికి దుబాయ్ విజిట్ వీసాలను దశల వారీగా ఇప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వీసాలు వచ్చిన బాధితులు గ్రూపులుగా దుబాయ్‌కి వెళ్లారు. వీరిని పబ్బ భూమేశ్ ఏర్పాటు చేసిన రూంలో ఉంచారు.. 82 మందిలో 30 మందికి మాత్రమే వర్క్ పర్మిట్ ఇప్పించి.. క్రెడిట్ కార్డులు ఇప్పించాడు. బాధితుల క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు విత్‌డ్రా.. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 82 మందిలో 30 మందికి వర్క్ వీసాలు రావడంతో పబ్బ భూమేశ్ అక్కడి క్రెడిట్ కార్డు బ్యాంక్ సిబ్బందితో అరబ్బీ, ఇంగ్లిష్‌లలో ఉన్న ఫారాలపై సంతకాలు చేయించాడు. తన అడ్రస్పైనే క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అవి రాగానే వాటి నుంచి మరో రూ. 5 కోట్లు డ్రా చేసినట్లు బాధితులు సీపీకి విన్నవించారు. క్రెడిట్ కార్డులకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిఫాల్ట్ కావడంతో పబ్బ భూమేశ్ 30 మందిని ఇండియా వెళ్లిపోవాలని.. వీసా సమస్య తలెత్తిందని.. లేదంటే జైలుకు వెళ్తారని భయభాంత్రులకు గురిచేశారు. దీంతో బాధితులు భోజారాంనకు ఫోన్ చేసి తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో త్వరగా ఇండియాకు వెళ్తే.. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తిరిగి ఇచ్చేస్తానని పబ్బ భూమేశ్ బాధితులకు చెప్పి పంపించేశాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడు. అంతేకాకుండా దుబాయ్‌లోని క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకు సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు సీపీని ఆశ్రయించారు. వైద్యానికి డబ్బులు లేక.. రూ. 6 లక్షలు చెల్లించిన ఓ గల్ఫ్ బాధితుడి కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక కొడుకును కాపాడుకోలేకపోయాడు. అలాగే మరో బాధితుడు అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని సబ్ ఏజెంట్ భోజారం తెలిపారు. బాధితులు చెల్లించిన రూ. 5కోట్లు వారికి అందేలా చూడాలని సీపీ కల్మేశ్వర్‌ను కోరినట్లు భోజారం చెప్పారు. నాలుగు నెలల క్రితం ఆర్మూర్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. విచారణ చేపడుతున్నాం సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గల్ఫ్‌లో జరిగిన మోసంపై విచారణ చేపట్టాం. సబ్ ఏజెంట్ భోజారం డబ్బులు ఎవరికి ఇచ్చారనే దానిపై విచారిస్తాం. బెజ్జం సుబ్బారెడ్డి, ఆరెపల్లి మహేశ్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు డబ్బులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని అంశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేని ఏజెంట్లకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు. – రాజశేఖరరాజు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, నిజామాబాద్ ఇవి చదవండి: బీచ్‌లో మెడికో మృతదేహం -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్‌వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023