Desert Vipers
-
నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. దుబాయ్ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అంధించాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ 19 ఓవర్ ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ క్రమంలో ఆఖరి ఓవర్లో దుబాయ్ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో దుబాయ్ బ్యాటర్లు సికందర్ రజా, స్కాట్ కుగ్గెలీజ్న్ ఉండగా.. డెసర్ట్ కెప్టెన్ మున్రో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను అలీ నీసర్కు అప్పగించాడు. తొలి బంతినే కుగ్గెలీజ్న్ బౌండరీకి తరిలించాడు. రెండో బంతికి డాట్, మూడో బంతికి కుగ్గెలీజ్న్ సింగిల్ తీసి రజాకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి రజా రెండు పరుగులు తీయగా.. ఐదు బంతికి ఎటువంటి పరుగు లేదు. దీంతో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. అయితే ఆఖరి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా అద్బుతమైన సిక్స్‌గా మలిచిన రజా.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వైపర్స్ బ్యాటర్లలో హేల్స్(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ బౌలర్లలో ఓలీ స్టోన్, వాండర్ మెర్వ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. Dubai Capitals stay alive by the skin of their teeth & they have Raza to thank 🙇🙌 6 needed on the last ball & the 🇿🇼 maestro deposits it over long off 🤯#DVvDC | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee pic.twitter.com/iygmkvjHCl — Zee Cricket (@ilt20onzee) February 9, 2024 -
ఇది కదా క్రీడా స్పూర్తి అంటే? రనౌట్ అయినా కూడా వెనుక్కి! వీడియో
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ కోలిన్ మున్రో మాత్రం అభిమానులు మనసును గెలుచకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. రనౌట్ రూపంలో వికెట్ పొందే అవకాశం ఉన్నప్పటకీ మున్రో మాత్రం తన నిర్ణయంతో అందరని ఆశ్చర్యపరిచాడు. ఏం జరిగిందంటే? షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో జో డెన్లీ స్ట్రైట్‌గా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మార్టిన్ గప్టిల్‌కు బలంగా తాకి బౌలర్ చేతికి వెళ్లింది. బంతి తగిలిన వెంటనే గప్టిల్ నొప్పితో కిందపడిపోయాడు. అప్పటికే గప్టిల్ క్రీజు బయట ఉండడం గమనించిన షాదాబ్ ఖాన్.. స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔట్ ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మాన్రో షాదాబ్తో మాట్లాడి రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ప్టిల్కు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించే అవకాశాన్ని మున్రో కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మున్రోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గప్టిల్, మున్రో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైంది. చదవండి: అతి జాగ్రత్తే కొంపముంచింది.. రోహిత్ కూడా సచిన్‌లా ఆడాలి: మాజీ క్రికెటర్ Being a good sport goes above being good at the sport. Hats off to the @TheDesertVipers skipper for playing a fair game 🫡🫡#DPWorldILT20 #AllInForCricket #DVvSW pic.twitter.com/IotodgnKs7 — International League T20 (@ILT20Official) January 28, 2024 -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్‌లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్‌కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్‌కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్‌రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్‌వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023