నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి! వీడియో వైరల్‌ | Sikandar Raza's last-ball six rockets DC to thrilling ILT20 win | Sakshi
Sakshi News home page

ILT 20: నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి! వీడియో వైరల్‌

Published Sat, Feb 10 2024 7:52 AM | Last Updated on Sat, Feb 10 2024 8:55 AM

Sikandar Razas last-ball six rockets DC to thrilling ILT20 win - Sakshi

ఇంటర్ననేషనల్‌ టీ20 లీగ్‌-2024లో దుబాయ్ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో దుబాయ్‌ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. దుబాయ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అంధించాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్‌ 19 ఓవర్‌ ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

ఈ క్రమంలో ఆ క్రమంలో ఆఖరి ఓవర్‌లో దుబాయ్‌ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో దుబాయ్‌ బ్యాటర్లు  సికందర్ రజా, స్కాట్ కుగ్గెలీజ్న్ ఉండగా.. డెసర్ట్ కెప్టెన్‌ మున్రో ఆఖరి ఓవర్‌ వేసే బాధ్యతను అలీ నీసర్‌కు అప్పగించాడు. తొలి బంతినే కుగ్గెలీజ్న్ బౌండరీకి తరిలించాడు. రెండో బంతికి డాట్‌, మూడో బంతికి కుగ్గెలీజ్న్ సింగిల్‌ తీసి రజాకు స్ట్రైక్‌ ఇచ్చాడు.

నాలుగో బంతికి రజా రెండు పరుగులు తీయగా.. ఐదు బంతికి ఎటువంటి పరుగు లేదు. దీంతో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్‌ డగౌట్‌లో టెన్షన్‌ వాతవారణం నెలకొంది. అయితే ఆఖరి బంతిని లాంగ్‌ ఆఫ్‌ మీదగా అద్బుతమైన సిక్స్‌గా మలిచిన రజా.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వైపర్స్‌ బ్యాటర్లలో హేల్స్‌(66) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్‌ బౌలర్లలో ఓలీ స్టోన్‌, వాండర్‌ మెర్వ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement