International League T20
-
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్‌కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్‌లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్‌ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి. -
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్‌లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్‌పై నిషేధం
గుజరాత్ టైటాన్స్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్మెంట్ నిషేధం విధించింది. షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్‌పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది. నూర్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్‌పై నిషేధం విధించింది. నూర్ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్‌పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్ వివదాస్పద బౌలర్ నవీన్ ఉల్ హాక్‌పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్ లాగే కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 19 ఏళ్ల నూర్.. 2023 ILT20 సీజన్లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ నూర్‌తో 2023 సీజన్‌కు ముందు 30 లక్షల బేస్ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్ 2023 ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. -
పూనకాలు తెప్పించిన పూరన్.. మరో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్ టీమ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. MI won the T20 league in India.MI won the T20 league in America.MI won the T20 league in Dubai. - MI franchise is ruling everywhere 🏆🫡 pic.twitter.com/ORTEE65GD0— Johns. (@CricCrazyJohns) February 17, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-20-2), విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్ తలో వికెట్ పడగొట్టారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టార్ ఆటగాళ్లు సికందర్ రజా (10), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన ముంబై కెప్టెన్ పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్. MI won CLT20 in 2011MI won IPL in 2013MI won CLT20 in 2013MI won IPL in 2015MI won IPL in 2017MI won IPL in 2019MI won IPL in 2020MI won WPL in 2023MINY won MLC in 2023MIE won ILT20 in 2024The Dominance of MI franchise. 🤯🔥 pic.twitter.com/GcGDcOqQ4I— Johns. (@CricCrazyJohns) February 17, 2024 -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. నైట్‌రైడర్స్ నిష్క్రమణ
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్‌రైడర్స్‌ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్‌రౌండ్ షోతో నైట్‌రైడర్స్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
ఇకపై ధోని నాకు బౌలింగ్ ఇవ్వనన్నాడు: తీక్షణ కామెంట్స్ వైరల్
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యువ క్రికెటర్లలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ ఒకడు. 2021లో లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక సభ్యుడిగా ఎదిగి జట్టులో తన స్థానం సుసిర్థం చేసుకున్నాడు. కాగా మహీశ్ తీక్షణ 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ఆడుతున్న విషయం తెలిసిందే. అనుకున్న ఫలితాలు రాబడుతూ.. తీక్షణ బౌలింగ్ నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. ఎప్పటికప్పుడు అతడిని ప్రోత్సహిస్తూ జట్టుకు కావాల్సిన ఫలితాలు రాబట్టాడు తలా. అంతేకాదు విమర్శలు వచ్చిన సమయంలోనూ అతడికి అండగా నిలబడ్డాడు. ఈ విషయాన్ని మహీశ్ తీక్షణ తాజాగా పునరుద్ఘాటించాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో.. షార్జా వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తీక్షణ.. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి పంచుకున్నాడు. ఐపీఎల్-2024లో ధోని తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వనన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నన్ను హగ్ చేసుకున్నారు.. ఇకపై బౌలింగ్ వద్దన్నారు! ‘‘ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నేను, మతీశ పతిరణ మా దేశానికి పయనం కావాల్సి ఉంది. అప్పటికే పార్టీ ముగించుకున్నాం. అయితే, వెళ్లేముందు ఒకసారి ధోనిని కలిసి వీడ్కోలు చెప్పాలని అనుకున్నాం. ఆయన మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నన్ను ఆలింగనం చేసుకుని.. ‘వచ్చే సీజన్లో నీకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వను. నువ్వు కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయాలి’ అని నాతో అన్నారు’’ అంటూ తమ మధ్య జరిగిన సరదా సంభాషణను తీక్షణ వెల్లడించాడు. అదే విధంగా తనపై విమర్శలు వచ్చిన సమయంలో ధోని అండగా నిలబడిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. క్యాచ్‌లు డ్రాప్ చేసినా నన్ను నమ్మారు ‘‘గతేడాది నా ఫీల్డింగ్ సరిగ్గా లేదు. కనీసం 4- 5 క్యాచ్‌లు డ్రాప్ చేశాను. అందుకు నేనే జవాబుదారీగా ఉన్నాను. ఏదేమైనా వాళ్లు(మేనేజ్మెంట్) నాపై నమ్మకం కోల్పోలేదు. నన్ను తుదిజట్టు నుంచి తప్పించలేదు. అందుకే ధోనితో కలిసి ఆడటం అందరికీ అంత ఇష్టం మరి! మనుషులన్నాక తప్పులు చేయడం సహజం.. ఇంకో అవకాశం ఇస్తే వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటారని ఆయనకు తెలుసు. ఆయనలో నాకు ఎక్కువగా నచ్చే గుణం అదే’’ అంటూ మహీశ్ తీక్షణ తలాపై ప్రశంసలు కురిపించాడు. ఎల్లవేళలా అండగా ధోని కాగా గతేడాది ఐపీఎల్ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫు మహీశ్ తీక్షణ 11 వికెట్లు తీశాడు. తద్వారా సీఎస్కే ఏకంగా ఐదోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు డ్రాప్ చేయడం వల్ల అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని తాజా ఇంటర్వ్యూలో 23 ఏళ్ల తీక్షణ గుర్తు చేసుకున్నాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్‌ను గెలిపించిన అఫ్రిది
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో నిన్న మరో రసవత్తర సమరం జరిగింది. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి బంతికి వైపర్స్ మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్) కావాల్సిన పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఫలితంగా వైపర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో వైపర్స్‌కు ఇది రెండో విజయం. pic.twitter.com/s2yg5r0O5B — Jas Pope (@jas_pope93438) January 30, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. మొహమ్మద్ ఆమీర్ (4-0-26-3), లూక్ వుడ్ (4-0-32-2), మతీష పతిరణ (4-0-32-2), హసరంగ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (28), అకీల్ హొసేన్ (24), అంబటి రాయుడు (23) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన వైపర్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహీన్ అఫ్రిది చివరి బంతికి మూడు పరుగుల తీసి వైపర్స్‌ను గెలిపించాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. అఫ్రిది, లూక్ వుడ్ (6 నాటౌట్) సాయంతో తన జట్టును గెలిపించాడు. వైపర్స్ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (35), హసరంగ (26), ఆజమ్ ఖాన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిద్ ఖాన్ 3 వికెట్లతో వైపర్స్‌ను ఇబ్బంది పెట్టగా.. ఫజల్ హక్ ఫారూకీ, డ్వేన్ బ్రావో తలో 2 వికెట్లు, సలామ్‌కీల్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఇది కదా క్రీడా స్పూర్తి అంటే? రనౌట్ అయినా కూడా వెనుక్కి! వీడియో
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ కోలిన్ మున్రో మాత్రం అభిమానులు మనసును గెలుచకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. రనౌట్ రూపంలో వికెట్ పొందే అవకాశం ఉన్నప్పటకీ మున్రో మాత్రం తన నిర్ణయంతో అందరని ఆశ్చర్యపరిచాడు. ఏం జరిగిందంటే? షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో జో డెన్లీ స్ట్రైట్‌గా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మార్టిన్ గప్టిల్‌కు బలంగా తాకి బౌలర్ చేతికి వెళ్లింది. బంతి తగిలిన వెంటనే గప్టిల్ నొప్పితో కిందపడిపోయాడు. అప్పటికే గప్టిల్ క్రీజు బయట ఉండడం గమనించిన షాదాబ్ ఖాన్.. స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔట్ ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మాన్రో షాదాబ్తో మాట్లాడి రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ప్టిల్కు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించే అవకాశాన్ని మున్రో కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మున్రోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గప్టిల్, మున్రో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైంది. చదవండి: అతి జాగ్రత్తే కొంపముంచింది.. రోహిత్ కూడా సచిన్‌లా ఆడాలి: మాజీ క్రికెటర్ Being a good sport goes above being good at the sport. Hats off to the @TheDesertVipers skipper for playing a fair game 🫡🫡#DPWorldILT20 #AllInForCricket #DVvSW pic.twitter.com/IotodgnKs7 — International League T20 (@ILT20Official) January 28, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి బ్యాటర్ లారీ ఎవాన్స్‌ను సంచలన క్యాచ్‌తో బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ విజయం సాధించింది. N̶o̶ f̶l̶y̶ z̶o̶n̶e̶ this term doesn't exist in Boult's dictionary ✈️ #MIEvADKR | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/RUPxDCx488 — Zee Cricket (@ilt20onzee) January 28, 2024 -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. కాగా ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵 Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V — Zee Cricket (@ilt20onzee) January 26, 2024 -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్‌లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్‌కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్‌కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్‌రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. -
జీరో దగ్గర వదిలేశాడు.. ఏకంగా విధ్వంసం సృష్టించేశాడు! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటిల్స్ శుభారంభం చేసింది. శనివారం ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్(81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొంపముంచిన ట్రెంట్ బౌల్ట్.. దుబాయ్ క్యాపిటిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్బాజ్‌కు ఆరంభంలోనే ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అవకాశమిచ్చేశాడు. సున్నా పరుగుల వద్ద గుర్బాజ్ ఇచ్చిన ఈజీ రిటర్న్ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు ఎంఐ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల వర్షం కురిపించాడు. గుర్బాజ్ ఏకంగా 81 పరుగులతో విజయాన్ని ముంబైకు దూరం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఒక వేళ గుర్భాజ్ క్యాచ్‌ను బౌల్ట్ పట్టివుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌల్ట్ విడిచిపెట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🫣 🫣#DCvMIE | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee | @ILT20Official pic.twitter.com/9D7H6fB9H8 — Zee Cricket (@ilt20onzee) January 20, 2024 -
తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024ను టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేలవంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీకి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు దారుణంగా విఫలమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్‌కు రాయుడు గుడ్‌బై చెప్పాడు. బీసీసీఐతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో భాగమయ్యాడు. అనంతరం ఐఎల్ టీ20 టోర్నీ-2024లో ఆడేందుకు ఎంఐ ఎమిరేట్స్‌తో రాయుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరెట్స్పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ బ్యాటర్లలో హ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్ -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారుఖ్ హాజరయ్యాడు. ఈ లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరేట్స్‌పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు Shah Rukh Khan spotted watching #ILT20 game in UAE pic.twitter.com/AW6BywpDF0 — Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) January 20, 2024 -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్‌టౌన్‌కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్‌కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్‌లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్‌మన్ పావెల్, రోలోఫ్ వాన్‌డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్‌వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్‌లో రెండో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్‌లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్‌రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్‌కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్‌లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్