ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది.
ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.
నికోలస్ పూరన్ భారీ సిక్సర్..
కాగా ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵
— Zee Cricket (@ilt20onzee) January 26, 2024
Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V
Comments
Please login to add a commentAdd a comment