ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు.
నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment