పూనకాలు తెప్పించిన పూరన్‌.. మరో టైటిల్‌ నెగ్గిన ముంబై ఇండియన్స్‌ | ILT20 2024: MI Emirates Beat Dubai Capitals By 45 Runs And Clinches The Title | Sakshi
Sakshi News home page

పూనకాలు తెప్పించిన పూరన్‌.. మరో టైటిల్‌ నెగ్గిన ముంబై ఇండియన్స్‌

Published Sun, Feb 18 2024 7:17 AM | Last Updated on Sun, Feb 18 2024 12:15 PM

ILT20 2024: Mumbai Indians Beat Dubai Capitals By 45 Runs And Clinches The Title - Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2024 ఎడిషన్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌  ఎమిరేట్స్‌ కైవసం చేసుకుంది. దుబాయ్‌ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్‌ టీమ్‌ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌.. నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 57 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్‌ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టాని​కి 208 పరుగులు చేసింది.

ఎమిరేట్స్‌ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్‌ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్‌ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో సికందర్‌ రజా, ఓలీ స్టోన్‌, జహీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్‌ క్యాపిటల్స్‌.. ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-20-2), విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్‌ హొసేన్‌, రోహిద్‌ ఖాన్‌, సలాంకీల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సామ్‌ బిల్లింగ్స్‌ (40), టామ్‌ బాంటన్‌ (35), జేసన్‌ హోల్డర్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..  స్టార్‌ ఆటగాళ్లు సికందర్‌ రజా (10), రోవ్‌మన్‌ పావెల్‌ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన ముంబై కెప్టెన్‌ పూరన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్‌ రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement