ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటిల్స్ శుభారంభం చేసింది. శనివారం ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్(81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కొంపముంచిన ట్రెంట్ బౌల్ట్..
దుబాయ్ క్యాపిటిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్బాజ్‌కు ఆరంభంలోనే ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అవకాశమిచ్చేశాడు. సున్నా పరుగుల వద్ద గుర్బాజ్ ఇచ్చిన ఈజీ రిటర్న్ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు ఎంఐ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
బౌండరీల వర్షం కురిపించాడు. గుర్బాజ్ ఏకంగా 81 పరుగులతో విజయాన్ని ముంబైకు దూరం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఒక వేళ గుర్భాజ్ క్యాచ్‌ను బౌల్ట్ పట్టివుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌల్ట్ విడిచిపెట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🫣 🫣#DCvMIE | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee | @ILT20Official pic.twitter.com/9D7H6fB9H8
— Zee Cricket (@ilt20onzee) January 20, 2024
Comments
Please login to add a commentAdd a comment