అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి.
గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్‌తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment