Global T20 Canada 2023: Abbas Afridi Takes 5 Wickets Helps Montreal Beat Vancouver By 1 Wicket - Sakshi
Sakshi News home page

విండీస్‌ ఆటగాడి ఒంటరి పోరాటం.. 5 వికెట్లతో చెలరేగిన అఫ్రిది

Published Sun, Aug 6 2023 3:04 PM | Last Updated on Sun, Aug 6 2023 3:32 PM

Global T20 Canada 2023: Abbas Afridi Takes 5 Wickets Haul, As Montreal Beat Vancouver By 1 Wicket - Sakshi

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌-2023లో భాగంగా వాంకోవర్‌ నైట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 5) జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మాంట్రియాల్‌ టైగర్స్‌ వికెట్‌ తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో రెండో ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో మాంట్రియాల్‌ టైగర్స్‌.. సర్రే జాగ్వార్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

ఐదేసిన అఫ్రిది..
క్వాలిఫయర్స్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాంకోవర్‌.. అబ్బాస్‌ అఫ్రిది (4-0-29-5) ధాటికి నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. అఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగగా.. అయాన్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. వాంకోవర్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ (33 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్‌), కోర్బిన్‌ బోష్‌ (28 బంతుల్లో 36; ఫోర్‌, 3 సిక్సర్లు) హర్ష్‌ ధాకర్‌ (21 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు పరుగులు చేయగా.. కెప్టెన్‌ వాన్‌​ డర్‌ డస్సెన్‌, నజీబుల్లా గోల్డెన్‌ డకౌట్లయ్యారు. 

రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్‌..
138 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్‌ అతి కష్టం మీద 9 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విండీస్‌ ఆల్‌రౌండర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (34 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరిపోరాటం​ చేసి మాంట్రియాల్‌ను గెలిపించాడు.

అతనికి దీపేంద్ర సింగ్‌ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు), ఆండ్రీ రసెల్‌ (11 బంతుల్లో 17; ఫోర్‌, 2 సిక్సర్లు), అయాన్‌ అఫ్జల్‌ (14 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) సహకరించారు. వీరు మినహా జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వాంకోవర్‌ బౌలర్లలో జునైద్‌ సిద్ధిఖీ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఫేబియన్‌ అలెన్‌, కోర్బిన్‌ బోష్‌ తలో 2 వికెట్లు, రూబెన్‌ ట్రంపెల్మెన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement