రషీద్‌ను దంచేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ | DArcy Short Takes Down Rashid Khan In Big Bash Leauge 2020 | Sakshi
Sakshi News home page

రషీద్‌ను దంచేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌

Published Sun, Dec 13 2020 1:12 PM | Last Updated on Sun, Dec 13 2020 8:23 PM

DArcy Short Takes Down Rashid Khan In Big Bash Leauge 2020 - Sakshi

హోబర్ట్‌ : బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో ఆదివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరకేన్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్‌ హరికేన్స్‌ బ్యాట్స్‌మెన్‌ డీ ఆర్సీ షార్ట్‌ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా అడిలైడ్‌ స్రైకర్స్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ను డీ ఆర్సీ షార్ట్‌ దంచికొట్టాడు. రషీద్‌ వేసిన ఒక ఓవర్‌లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌ సహా మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే డీ ఆర్సీ షార్ట్‌ టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.(చదవండి : ముందు మీ టాప్‌ ఆర్డర్‌ చూసుకో : వసీం జాఫర్) 

వాస్తవానికి షార్ట్‌ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు డాన్‌ వోర్రాల్‌ క్యాచ్‌ జారవిడవడంతో బతికిపోయిన డీ ఆర్సీ షార్ట్‌ మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్‌ స్ట్రైక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్‌ బ్యాట్స్‌మెన్లలో డేనియల్‌ వోర్రాల్‌ 66* పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్‌ బౌలర్లలో జేమ్స్‌ ఫాల్కనర్‌ 3 వికెట్లతో రాణించగా.. జాన్‌ బోతా, రెలీ మెరిడిత్‌ చెరో 2 వికెట్లు తీశారు.(చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్‌ ఔట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement