Hobart
-
ఆసీస్‌తో చారిత్రక సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) -
రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ హరికేన్స్ బ్యాట్స్‌మెన్ డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా అడిలైడ్ స్రైకర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌ను డీ ఆర్సీ షార్ట్ దంచికొట్టాడు. రషీద్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సహా మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే డీ ఆర్సీ షార్ట్ టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.(చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) వాస్తవానికి షార్ట్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు డాన్ వోర్రాల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన డీ ఆర్సీ షార్ట్ మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రెలీ మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు.(చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) 6⃣ 6⃣ 4⃣ 6⃣ 2⃣ D'Arcy Short smashes 24 runs in a single over off the No.1 T20I bowler, Rashid Khan 🔥#BBL10 pic.twitter.com/FsSRtj1Okh — ICC (@ICC) December 13, 2020 -
శభాష్ సానియా
హోబర్ట్: భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. తల్లి అయ్యాక ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే ఈ హైదరాబాద్ క్రీడాకారిణి టైటిల్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. శనివారం ముగిసిన హోబర్ట్ ఓపెన్‌లో సానియా (భారత్)–నదియా కిచోనోక్ (ఉక్రెయిన్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా–నదియా ద్వయం 6–4, 6–4తో షుయె పెంగ్–షుయె జాంగ్ (చైనా) జంటను ఓడించింది. 33 ఏళ్ల సానియాకు కెరీర్లో ఇది 42వ డబుల్స్ టైటిల్‌కాగా... 27 ఏళ్ల నదియా ఐదో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. విజేత సానియా–నదియా జంటకు 13,580 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 65 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2017లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తర్వాత సానియా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడిన సానియా ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచి్చంది. 2018 అక్టోబర్‌లో మగబిడ్డ ఇజ్హాన్కు జన్మనిచ్చిన సానియా 2019 మొత్తం ఆటకు దూరంగా ఉంది. హోబర్ట్ ఓపెన్ టైటిల్‌తో సీజన్‌ను ఆరంభించిన సానియా సోమవారం మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నదియాతోనే కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగనుంది. ఇంతకంటే మంచి పునరాగమనాన్ని ఆశించలేదు. నా పిల్లాడు, తల్లిదండ్రులు వెంటరాగా నేను టైటిల్ సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. అత్యున్నతస్థాయిలో మళ్లీ అద్భుతంగా ఆడతానని ఊహించలేదు. టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. విజయం సాధించాలంటే ఆటను ఆస్వాదిస్తూ ఆడాలి. నేను అదే చేశా. కొత్త భాగస్వామితో, కొత్త ఏడాదిలో ఆడుతున్నాను కాబట్టి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగడంతో ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎలా ఆడతానో, నా ఫిట్నెస్ ఎలా ఉంటుందోనని కాస్త కంగారు పడ్డాను. నెల రోజులుగా కాలి పిక్కలో కాస్త నొప్పిగా ఉంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో ఆరు నెలల సమయం ఉన్న టోక్యో ఒలింపిక్స్ గురించి ఇప్పుడే ఆలోచించడంలేదు. టోక్యో కంటే ముందు మరో 15 టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. వాటి గురించే నేను ఆలోచిస్తున్నాను. –సానియా మీర్జా -
సానియా సాధించెన్..
హోబర్ట్ : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీజన్‌ను ఘనంగా ఆరంభించారు. పునరాగమనంలో ఆడిన తొలి టోర్నీలోనే టైటిల్ గెలిచి తనలోని సత్తాతగ్గలేదని నిరూపించారు. శనివారం ముగిసిన హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించారు. తుది పోరులో సానియా-నదియా కిచోనాక్(ఉక్రెయిన్) జోడీ 6-4,6-4 తేడాతో షువై పెంగ్-షువై ఝంగ్(చైనా) ద్వయంపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి అదరగొట్టింది. ఎటువంటి తడబాటు లేకుండా ఆడిన సానియా జోడి.. చైనా జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫైనల్‌కు చేరే క్రమంలో కనబరిచిన ఆటనే సానియా జోడి పునరావృతం చేయడంతో టైటిల్ వారి వశమైంది. -
ఫైనల్‌కు చేరిన సానియా మీర్జా..
హోబర్ట్ : రీఎంట్రీలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అదరగొడుతోంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్‌లో పునరాగమనం చేసిన ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి వరుస విజయాలతో దూసుకపోతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా టెన్నిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన సానియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సానియా– నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 7-6(3), 6-2 తేడాతో టమరా జిదాన్సెక్ (స్లోవేనియా)– మేరి బౌజ్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్దమైంది. గంటా 24 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ పోరులో ఆద్యంతం సానియా జోడినే ఆదిపత్యం ప్రదర్శించింది. 15 బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించి విజయం అందుకుంది. ఇక 2017లో చైనా ఓపెన్‌లో చివరి సారి రాకెట్ పట్టిన ఈ సానియా.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి దిగింది. తల్లి కావడంతో ఇంతకాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియాకు ఇజహాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ఇక రీఎంట్రీ కోసం సానియా తీవ్రంగా కష్టపడింది. దీనికోసం నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. దీంతో ఆటపై సానియాకు ఉన్న నిబద్దతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. -
సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ
హోబర్ట్: పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అదరగొడుతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా– నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6–2, 4–6, 10–4తో అమెరికా ద్వయం క్రిస్టీనా మెక్‌హేల్–వనియా కింగ్‌పై గెలిచింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ అద్భుతంగా ఆడింది. నేడు జరిగే సెమీస్‌లో పోరులో టమరా జిదాన్సెక్ (స్లోవేనియా)– మేరి బౌజ్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా– కిచెనోక్ ద్వయం తలపడుతుంది. -
సానియా జంట శుభారంభం
హోబర్ట్: భారత స్టార్ సానియా మీర్జా విజయంతో అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. డబుల్స్ తొలి రౌండ్లో సానియా–నదియా జోడీ 2–6, 7–6 (7/3), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ఒక్సానా కలష్నికోవా (జార్జియా)–మియు కాటో (జపాన్) జంటపై గెలిచింది. 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో చివరిసారి ఆడిన 33 ఏళ్ల సానియా ఆ తర్వాత 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చి ఆటకు విరామం ఇచ్చింది. -
‘హోబర్ట్’ బరిలో సానియా మీర్జా
ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో బరిలోకి దిగనుంది. వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు అంతకు ముందు జరిగే çహోబర్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొంటానని 33 ఏళ్ల హైదరాబాదీ స్టార్ తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో ఆమె నాదియా కిచనోక్ (ఉక్రెయిన్), మిక్స్డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగుతుంది. 2017 అక్టోబర్నుంచి సానియా ఆటకు విరామం తీసుకుంది. -
హోబర్ట్ (బెల్లెరివ్ ఓవల్)
టాస్మానియా రాజధాని అయిన హోబర్ట్ను 1804లో కనుగొన్నారు. ఎక్కువ మంది పర్యాటకులు... చరిత్రాత్మక శివారు ప్రాంతాలను తిలకించేందుకు ఇక్కడకు వస్తుంటారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన రెస్టారెంట్లు, కెఫేలు, ఉత్సాహపూరితమైన సంగీతం, నైట్‌లైఫ్ కల్చర్‌కు ఇది చాలా ప్రసిద్ధి. బెల్లెరివ్ ఓవల్ మైదానం టాస్మానియా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రధాన కేంద్రం. 1988 నుంచి ఇక్కడ క్రికెట్ ఊపందుకుంది. గతంలో ఫుట్‌బాల్ స్టేడియంగా కూడా వాడుకున్నారు. హోబర్ట్ సిటీ సెంటర్ నుంచి 10 నిమిషాల ప్రయాణం. 1931లో నిర్మించిన ఈ స్టేడియాన్ని బెల్లెరివ్లో 2003 వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. సదరన్ స్టాండ్స్‌లో కొత్తగా 6 వేల సీట్లను అందుబాటులోకి తేవడంతో పాటు ఇండోర్ నెట్స్, ఇద్దరు సభ్యులకు బిల్డింగ్‌లను నిర్మించారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 20 వేలు. ఈస్ట్రన్ బౌండరీ వైపు ఎత్తై గుట్ట ఉండటం ప్రత్యేక ఆకర్షణ. మైదానం మధ్యలో 10 వికెట్లను రూపొందించారు. దీనికి కొద్ది దూరంలో డార్వెంట్ నది ఉండటంతో మధ్యాహ్నం సమయంలో గాలులు వీస్తాయి.