హోబర్ట్ : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీజన్‌ను ఘనంగా ఆరంభించారు. పునరాగమనంలో ఆడిన తొలి టోర్నీలోనే టైటిల్ గెలిచి తనలోని సత్తాతగ్గలేదని నిరూపించారు. శనివారం ముగిసిన హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించారు. తుది పోరులో సానియా-నదియా కిచోనాక్(ఉక్రెయిన్) జోడీ 6-4,6-4 తేడాతో షువై పెంగ్-షువై ఝంగ్(చైనా) ద్వయంపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి అదరగొట్టింది. ఎటువంటి తడబాటు లేకుండా ఆడిన సానియా జోడి.. చైనా జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫైనల్‌కు చేరే క్రమంలో కనబరిచిన ఆటనే సానియా జోడి పునరావృతం చేయడంతో టైటిల్ వారి వశమైంది.
Comments
Please login to add a commentAdd a comment