
ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్‌లో బరిలోకి దిగనుంది. వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు అంతకు ముందు జరిగే çహోబర్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో పాల్గొంటానని 33 ఏళ్ల హైదరాబాదీ స్టార్ తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో ఆమె నాదియా కిచనోక్ (ఉక్రెయిన్), మిక్స్‌డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగుతుంది. 2017 అక్టోబర్‌నుంచి సానియా ఆటకు విరామం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment