సానియా జంట శుభారంభం | Sania Mirza Makes Winning Return After Two Years With Doubles Win At Hobart | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Published Wed, Jan 15 2020 3:37 AM | Last Updated on Wed, Jan 15 2020 3:37 AM

Sania Mirza Makes Winning Return After Two Years With Doubles Win At Hobart - Sakshi

హోబర్ట్‌: భారత స్టార్‌ సానియా మీర్జా విజయంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సర్క్యూట్‌లో పునరాగమనం చేసింది. హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా–నదియా జోడీ 2–6, 7–6 (7/3), 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఒక్సానా కలష్నికోవా (జార్జియా)–మియు కాటో (జపాన్‌) జంటపై గెలిచింది.  2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో చివరిసారి ఆడిన 33 ఏళ్ల సానియా ఆ తర్వాత 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చి ఆటకు విరామం ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement