![Qais Ahmad Comically Sends Bat Flying In The Air In BBL - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/9/Bat.jpg.webp?itok=g8QGbsyu)
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్‌లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్‌కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్‌లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు)
Comments
Please login to add a commentAdd a comment