
హోబార్డ్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)-10 వ సీజన్ ఇప్పటికే అభిమానులకు కావాల్సిన మజాను అందించగా, ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో సరదా సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి సరిగ్గా వెళ్లి ఒక అభిమాని తాగుతున్న బీర్ కప్‌లో పడింది. శనివారం(జనవరి 2వ తేదీన) హోబర్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. విషయంలోకి వెళితే.. హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు సాధించాడు. కాగా, అందులో ఒక సిక్స్ ఫ్యాన్ బీర్ మగ్‌లో పడింది. మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన 16వ ఓవర్‌లో ఒక బంతిని మలాన్ భారీ షాట్ ఆడాడు. స్వేర్ లెగ్ మీదుగా లాఫ్టెడ్ స్ట్రోక్ ఆడాడు. (ఓడిపోతామనే నాల్గోటెస్టు ఆడమంటున్నారా?)
గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడగా అది కాస్తా వెళ్లి ఒక అభిమాని బీర్ మగ్‌లో పడింది. అది కామెంటేటర్లతో పాటు కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది. కాగా, బీర్ మగ్‌లో పడ్డ ఆ బంతిని ఇవ్వడానికి సదరు అభిమానికి తొలుత నిరాకరించాడు. తాను బంతిని ఇవ్వనంటూ ఫీల్డర్‌ను ఆటపట్టించాడు. ఆ బంతి మగ్‌లో ఉండగానే ఒక చిప్‌లాగించిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చాడు. ఇది బీబీఎల్ బెస్ట్ క్యాచ్‌ల్లో స్థానం సంపాదించకపోయినప్పటికీ ఆ అభిమానికి మాత్రం అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
What the... An all-time Bucket Moment! 😂🤷♂️#BBL10 | @KFCAustralia pic.twitter.com/V5b9Xm34B4
— KFC Big Bash League (@BBL) January 2, 2021
Comments
Please login to add a commentAdd a comment