austrlia
-
జోస్ ఇంగ్లీష్ అరుదైన ఘనత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ విఫలమైన చోట స్కాటిష్ బౌలర్లను ఇంగ్లిష్ ఊచకోత కోశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లిష్‌కు ఇది రెండో టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న జోష్ 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.జోష్ది బాస్..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లిష్.. తన సొంత రికార్డునే బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లిష్, మాక్స్వెల్, ఆరోన్ ఫించ్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరి ముగ్గురూ 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లిష్.. హెడ్, మాక్సీని అధిగిమించి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. స్కాట్లాండ్పై 70 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0తో కంగరూలు కైవసం చేసుకున్నారు. -
ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్ స్పందన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్కాస్ట్లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కారా స్విషర్ పోడ్కాస్ట్లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దక్షిణాఫ్రికాతో తుది పోరు.. తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆసీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. తొలి సారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, సునే లూస్(కెప్టెన్), అన్నెకే బోష్, సినాలో జాఫ్తా(వికెట్‌కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, ఆయబొంగ ఖాకా, మ్లాబా ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాసెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ చదవండి: IND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆస్ట్రేలియాలో జననేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కృష్ణా రెడ్డి, భరత్,బ్రహ్మారెడ్డి ,రామాంజిలు మెల్బోర్న్ నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు -
ఆస్ట్రేలియా జట్టు హెడ్‌కోచ్‌గా షెల్లీ నిట్ష్కే..
ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ షెల్లీ నిట్ష్కే ఎంపికయ్యంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది . షెల్లీ నిట్ష్కే నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా మహిళలల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయనుంది. కాగా అంతకుముందు ఆసీస్ హెడ్ కోచ్‌గా పనిచేసిన మథ్యూ మాట్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. ప్రపంచంలోనే అత్యత్తుమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన షెల్లీ నిట్ష్కే.. ఆస్ట్రేలియా తరపున 80 వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 3000 పైగా పరుగులతో పాటు, 150 వికెట్లు పడగొట్టింది. ఇక కోచ్‌గా కూడా షెల్లీ నిట్ష్కేకు అపారమైన అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె దేశీవాళీ జట్టు సౌత్ ఆస్ట్రేలియాకు కోచ్‌గా కూడా పని చేసింది. అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా జట్టు మహిళలల ఆస్టెంట్ కోచ్‌గా ఆమె పనిచేసింది. మరోవైపు 2019 నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా ఆసీస్ కోచ్‌గా ఎంపిక కావడంతో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనుంది. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేటి స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు షేన్ వార్న్ సొంతం. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్ అందుకున్నాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్.. 2013లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌గా నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్లో రాజస్తాన్ టైటిల్ గెలవడంలో అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు. -
Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అబ్బో సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు!
Shoaib Akhtar On Australia Way of Celebration Little Disgusting Netizens Troll Him: టి20 ప్రపంచకప్-2021 విజేతగా నిలిచిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు చేసుకున్న తీరుపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసహ్యకరంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం అవసరమా అంటూ సెటైర్లు వేశాడు. కాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆరుసార్లు నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచి తమ కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంగారూ జట్టు పట్టపగ్గాల్లేని ఆనందడోలికల్లో మునిగితేలింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న పొట్టి కప్ చేతులకందడంతో ఆటగాళ్లు తెగ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్‌కు చేరగానే క్రికెటర్లు టిన్‌లలోని బీరును కాలి బూట్లలో పోసుకొని గుటకేశారు. ఆల్‌రౌండర్ స్టొయినిస్ కాలికి ఉన్న బూట్ విడిచి దాన్ని కడిగాకా బీరు పోసుకొని తాగాడు. కెప్టెన్ ఫించ్ అదేపని చేశాడు. తర్వాత వేడ్ సహా కొందరు సహచరులు ఇలా బూట్లలో బీరు తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసిన షోయబ్ అక్తర్.. ‘‘అసలు మీరేం చేశారు? వీళ్లు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు కాస్త అసహ్యంగా ఉంది కదా’’ అని కామెంట్ చేశాడు. ఈ క్రమంలో పాక్ ఫ్యాన్స్.. ‘‘కొంచెం కాదు.. చాలా జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ అక్తర్‌కు మద్దతు పలుకుతున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘ఇది వారి సంప్రదాయంలో భాగం. ముందు ఆ విషయం తెలుసుకోండి. తెలియకపోతే ఊరుకోండి. అయినా, సెమీస్‌లో మిమ్మల్ని ఓడించినందుకేనా ఈ అక్కసు’’ అని అక్తర్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సూపర్ 12 రౌండ్లో ఐదింటికి ఐదు గెలిచి కప్ కొట్టాలన్న ఆశతో ఉన్న బాబర్ ఆజమ్ బృందానికి షాక్ తగిలింది. తుది పోరుకు అర్హత సాధించిన ఆసీస్.. న్యూజిలాండ్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. షూయీ సంప్రదాయం ఇలా బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగటం మనకు జుగుప్సాకరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో ఇలాంటి సంబరాలు సాధారణమే! అన్నట్లు దీనికో పేరు కూడా ఉంది. షూలో పోసుకు తాగడాన్ని ‘షూయి’ అంటారు. విశ్వవిజేతగా నిలవడంతో కంగారూ క్రికెటర్లు అలా షూయి వేడుక చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫార్ములావన్ డ్రైవర్ రికియార్డో 2016లో జర్మన్ గ్రాండ్‌ప్రిలో పోడియం ఫినిష్ చేయగానే తొలిసారి షాంపేన్ బూట్లో పోసుకొని తాగాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! A little disgusting way of celebrating no?? pic.twitter.com/H96vMlabC8 — Shoaib Akhtar (@shoaib100mph) November 15, 2021 -
అమ్మాయిలూ సూపర్: రికార్డు విజయం... రికార్డు బ్రేక్
29 అక్టోబర్, 2017... ఆస్ట్రేలియా మహిళల జట్టు చివరిసారి వన్డేల్లో ఓడిన రోజు. ఆ మ్యాచ్ తర్వాత ఆ్రస్టేలియా జైత్రయాత్ర మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు కాదు... వరుసగా 26 వన్డేల్లో ఆ జట్టు గెలుస్తూ వచి్చంది. పురుషుల, మహిళల క్రికెట్లో ఏ జట్టుకూ సాధ్యంకాని ఘనతను సాధించింది. ఎట్టకేలకు 3 సంవత్సరాల 11 నెలల తొమ్మిది రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డేల్లో ఓటమి చవిచూసింది. రెండో వన్డేలో చివరి బంతికి ఓడిపోయిన బాధను అధిగమిస్తూ... సిరీస్‌ను కోల్పోయిన విషయాన్ని విస్మరిస్తూ... మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు చివరిదైన మూడో వన్డేలో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా దూకుడుగా ఆడింది. మూడు బంతులు మిగిలి ఉండగా 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును సృష్టించింది. దాదాపు నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాకు పరాజయం రుచి చూపించింది. చివరి వన్డేలో ఓడినా ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మెకాయ్ (క్వీన్స్లాండ్): తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడ్డ భారత మహిళల జట్టు చివరి వన్డేలో మాత్రం రికార్డు ఛేదనతో అదరగొట్టింది. 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. వన్డేల్లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. మరోవైపు వరుసగా 26 వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియాకు ఇదే తొలి పరాజయం. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య ఈనెల 30న ఏకైక టెస్టు (డే/నైట్) మొదలవుతుంది. శుభారంభం... టాస్ గెలిచిన ఆ్రస్టేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. యాష్లే గార్డ్నర్ (62 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెత్ మూనీ (64 బంతుల్లో 52; 6 ఫోర్లు), తహిలా మెక్‌గ్రాత్ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో మూడు వికెట్లు తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ (91 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం యస్తిక భాటియా (69 బంతుల్లో 64; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. షఫాలీ, యస్తిక రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఈ క్రమంలో షఫాలీ, యస్తిక వన్డేల్లో తమ తొలి అర్ధ సెంచరీలను సాధించారు. షఫాలీ అవుటయ్యాక రిచా ఘోష్ (0), యస్తిక, పూజా వ్రస్తాకర్ (3), కెపె్టన్ మిథాలీ రాజ్ (16) వెంట వెంటనే అవుటవ్వడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే దీప్తి శర్మ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) నిలబడి భారత్‌ను విజయం దిశగా నడిపించారు. అయితే ఓవర్ తేడాలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో జులన్ గోస్వామి (7 బంతుల్లో 8 నాటౌట్; 1 ఫోర్), మేఘన సింగ్ (3 బంతుల్లో 2 నాటౌట్) ఒత్తిడికి లోనుకాకుండా ఆడి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు విజయాన్ని అందించారు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఆసీస్ స్పిన్నర్ మోలినెక్స్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి మేఘన పరుగు తీయలేదు. రెండో బంతికి సింగిల్ తీసి జులన్ గోస్వామికి స్ట్రయిక్ ఇచి్చంది. మూడో బంతిని జులన్ గోస్వామి ముందుకు వచ్చి స్ట్రయిట్ లాఫ్టెడ్ షాట్ కొట్టింది. బంతి బౌండరీ దాటింది. భారత్‌కు విజ యం ఖాయమైంది. రెండో వన్డేలో జులన్ గోస్వామి వేసిన చివరి ఓవర్లోనే భారత్ ఓటమి చవిచూడగా... మూడో వన్డేలో జులన్ గోస్వామియే భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తాజా గెలుపుతో భారత్ 2019లో వదోదరాలో దక్షిణాఫ్రికాపై ఛేదించిన 248 పరుగుల లక్ష్యం రికార్డును సవరించింది. సంక్షిప్త స్కోర్లు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: 264/9 (అలీసా హీలీ 35, ఎలీస్ పెర్రీ 26, బెత్ మూనీ 52, యాష్లే గార్డ్నర్ 67, తహిలా మెక్‌గ్రాత్ 47, జులన్ గోస్వామి 3/37, పూజా వస్త్రాకర్ 3/46); భారత్ ఇన్నింగ్స్: 266/8 (49.3 ఓవర్లలో) (షఫాలీ వర్మ 56, స్మృతి మంధాన 22, యస్తిక భాటియా 64, దీప్తి శర్మ 31, స్నేహ్ రాణా 30, అనాబెల్ సదర్లాండ్ 3/30). ఈ విజయంతో చాలా ఆనందంగా ఉన్నాం. భారత్‌లో భారత్‌పైనే ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపర మొదలైంది. ఆసీస్ విజయాలకు మనమే అడ్డకట్ట వేయగలమని జట్టు సభ్యులకు చెబుతూ వచ్చాను. చివరికి అమ్మాయిలు నిజం చేసి చూపించారు. షఫాలీ, యస్తిక, స్నేహ్ రాణా అద్భుతంగా ఆడారు. – మిథాలీ రాజ్ -
గురుకులం నుంచి ఆస్ట్రేలియాకు..
సాక్షి, రాయదుర్గం: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డికి చెందిన పూర్వ విద్యార్థి మనోజ్ఞ ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ యూనివర్సిటీలోని ఐఈఎల్‌టీఎస్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సుకు ఎంపికైంది. 6.5/9 మార్కులతో 50 శాతం ఉపకార వేతనంతో ఆమె ఈ కోర్సులో చేరేందుకు అవకాశం లభించడం విశేషం. 2019–20 విద్యాసంవత్సరంలో గౌలిదొడ్డి గురుకులంలో మనోజ్ఞ ఎంఈసీ గ్రూపులో 921/1000 మార్కులు సాధించింది. జాతీయ స్థాయి సీఎంఏ ఫౌండేషన్‌లో అర్హత కూడా సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అంబటిపూడి శారద మాట్లాడుతూ మనోజ్ఞ ప్రస్తుతం కోఠి మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతోందన్నారు. ఆమె అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గర్వంగా ఉందని, ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి ఆర్.శారద, ఓఎస్డీ రంగారెడ్డి, కామర్స్ అధ్యాపకులు గోపీనాథ్, ఇతర అధ్యాపకులు ఆమెను అభినందించారు. -
సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!
హోబార్డ్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)-10 వ సీజన్ ఇప్పటికే అభిమానులకు కావాల్సిన మజాను అందించగా, ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో సరదా సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి సరిగ్గా వెళ్లి ఒక అభిమాని తాగుతున్న బీర్ కప్‌లో పడింది. శనివారం(జనవరి 2వ తేదీన) హోబర్ట్ హరికేన్స్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. విషయంలోకి వెళితే.. హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు సాధించాడు. కాగా, అందులో ఒక సిక్స్ ఫ్యాన్ బీర్ మగ్‌లో పడింది. మెల్బోర్న్ స్టార్స్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన 16వ ఓవర్లో ఒక బంతిని మలాన్ భారీ షాట్ ఆడాడు. స్వేర్ లెగ్ మీదుగా లాఫ్టెడ్ స్ట్రోక్ ఆడాడు. (ఓడిపోతామనే నాల్గోటెస్టు ఆడమంటున్నారా?) గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడగా అది కాస్తా వెళ్లి ఒక అభిమాని బీర్ మగ్‌లో పడింది. అది కామెంటేటర్లతో పాటు కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది. కాగా, బీర్ మగ్‌లో పడ్డ ఆ బంతిని ఇవ్వడానికి సదరు అభిమానికి తొలుత నిరాకరించాడు. తాను బంతిని ఇవ్వనంటూ ఫీల్డర్‌ను ఆటపట్టించాడు. ఆ బంతి మగ్‌లో ఉండగానే ఒక చిప్లాగించిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చాడు. ఇది బీబీఎల్ బెస్ట్ క్యాచ్‌ల్లో స్థానం సంపాదించకపోయినప్పటికీ ఆ అభిమానికి మాత్రం అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. What the... An all-time Bucket Moment! 😂🤷♂️#BBL10 | @KFCAustralia pic.twitter.com/V5b9Xm34B4 — KFC Big Bash League (@BBL) January 2, 2021 -
పృథ్వీ షా, గిల్ డకౌట్లు.. రహానే శతకం
డ్రమ్మోయ్నీ ఓవల్(సిడ్నీ): ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో రహానే నేతృత్వంలోని భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్లు ఆరంభించారు. వీరిద్దరూ డకౌట్లుగా వెనుదిరగడంతో భారత ’ఎ’ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుజారా 140 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. (చదవండి:ఫించ్ ఔట్.. కెప్టెన్‌గా వేడ్) అనంతరం అజింక్యా రహానే శతకం నమోదు చేశాడు. 228 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 108 పరుగులు చేశాడు. హనుమ విహారి(15), సాహా(0), అశ్విన్(5)లు నిరాశ పరచగా, టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్(15), ఉమేశ్ యాదవ్(24) ఫర్వాలేదనిపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రహానే, మహ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ‘ఎ’ జట్టులో జేమ్స్ పాటిన్సన్ మూడు వికెట్లు సాధించగా, మైకేల్ నేసర్, ట్రావిస్ హెడ్లు తలో రెండు వికెట్లు తీశారు. జాక్సన్ బర్డ్‌కు వికెట్ దక్కింది. ఒకవైపు ఆసీస్-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగుతుండగానే, మరొకవైపు ఆసీస్-భారత్ ‘ఎ’ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండటం విశేషం. -
క్రికెటర్ భార్య ‘రికార్డు’ సెంచరీ!
వడోదరా:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత మహిళలతో జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అలైస్సా హేలీ(133) శతకం సాధించి పలు రికార్డులను నమోదు చేసింది. భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించడమే కాకుండా, ఆ దేశం తరపున తొలి సెంచరీ చేసిన మహిళా వికెట్ కీపర్‌గా హేలీ నిలిచింది. అయితే ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యనే అలైస్సా హేలీ. ఒకవైపు ఆసీస్ పురుషుల జట్టు విజయాల్లో స్టార్క్ తనదైన ముద్రతో చెలరేగి పోతుంటే, మహిళా జట్టులో అతని భార్య హేలీ కూడా కీలక క్రీడాకారిణిగా మారిపోయింది. ఆదివారం జరిగిన వన్డేలో హేలీ 115 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది. ఆది నుంచి భారత బౌలర్లపై పైచేయి సాధించిన హేలీ శతకంతో మెరిసింది. దాంతో ఆసీస్ 332 భారీ పరుగులు సాధించకల్గింది. అయితే, ఈ రికార్డుల గురించి తనకు ముందుగా తెలియదని, మ్యాచ్ తర్వాత సహచరులు చెబితేనే తెలిసిందని హేలీ పేర్కొంది. -
ఆస్ట్రేలియా వెళ్దామనుకుని అనంతలోకాలకు..
మేడ్చల్ రూరల్ : బీటెక్ పూర్తి చేసిన ఓ విద్యార్థి మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన మంగళవారం రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంభవించింది. వివరాల.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఆశిష్(24), సాయి(23) చదువు నిమిత్తం కొంపల్లిలోని సినీప్లానెట్ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆశిష్ మండలంలోని కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో 2016లో బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయి.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఆశిష్, సాయిలు ఇద్దరు కలిసి తన స్నేహితుడి బైక్‌పై మేడ్చల్‌కు వెళ్తుండగా కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వారు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ట్రాలీ ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా సాయి తీవ్ర గాయాలకు గురి కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డకౌట్ తో కోహ్లి సరికొత్త రికార్డు..!
గువాహటి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా 119 పరుగుల మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి గ్యాంగ్ వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.జాసన్ బెహ్రెన్ డార్ఫ్ విసిరిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి విరాట్ బంతికి కోహ్లి జాసన్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆపై మనీష్ పాండే, (6), శిఖర్ ధావన్ (2)లను కూడా పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత జట్టు 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, విరాట్ కోహ్లి ఏది చేసినా రికార్డు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. తన కెరీర్ లో 48వ ట్వంటీ 20 ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ ఫార్మాట్ లో తొలిసారి డకౌట్ గా నిష్క్రమించాడు. తద్వారా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక ఇన్నింగ్స్ లు ఆడిన తరువాత డకౌటైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. టీ 20ల్లో మాలిక్ 40 ఇన్నింగ్స్ లు తరువాత డకౌట్ కాగా, దాన్ని కోహ్లి సవరించాడు. ఇక్కడ యువరాజ్(39), షెన్వారీ(38), మోర్గాన్(35), మెకల్లమ్(33), గ్రేమ్ స్మిత్ (31) తరువాత స్థానల్లో ఉన్నారు. -
స్టీవ్ స్మిత్ ఎమోషనల్ మెసేజ్
రాంచీ:టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నాడు. వన్డే సిరీస్ లో ఘోర పరాభవాన్ని, ఆపై తొలి ట్వంటీ 20లో ఓటమిని దగ్గరుండి వీక్షించిన స్మిత్.. ఆస్ట్రేలియాకు పయనమవుతూ ఒక ఉద్వేగభరిత సందేశాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 'ప్రస్తుతం వరుస విజయాలతో భారత్ ఆనందంగా ఉంది. భారత పర్యటనలో మాకు నిరాశే మిగిలింది. మా వన్డే పర్యటన ప్రణాళిక ప్రకారం సాగలేదు. భారత్ పై దారుణ పరాభవం మాకు కొన్ని చేదు జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. మమ్మల్ని దురదృష్టం కూడా వెంటాడింది. నాకు గాయం కావడంతో గత మ్యాచ్ కు దూరం కావడం ఎక్కువగా బాధించింది. ఇక కొద్ది పాటి విశ్రాంతి తీసుకుంటూ ఆటగాళ్ల పునరావస శిబిరంలో పాల్గొంటూ గాయం నుంచి కోలుకోవడానికి యత్నిస్తా. మిగతా టీ 20ల్లో మా అదృష్టం మారుతుందేమోనని ఆశతో ఎదురుచూస్తూ ఉంటా'అని స్మిత్ పేర్కొన్నాడు. -
టీమిండియాను ఊరిస్తున్న విజయం!
బెంగళూరు:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను విజయం ఊరిస్తోంది. మంగళవారం ఆటలో 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను భారత్ కట్టడి చేస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో 101 పరుగులకే ఆరు ఆసీస్ వికెట్లను భారత్ నేలకూల్చింది ఆసీస్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెన్ షా(5), డేవిడ్ వార్నర్(17), షాన్ మార్ష్(9), స్టీవ్ స్మిత్(28), మిచెల్ మార్ష్(13), వేడ్(0)లు పెవిలియన్ చేరారు. ఈ ఆరు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ఆస్ట్రేలియాపై రెండు సార్లు.. గతంలో 188 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని భారత్ జట్టు మూడుసార్లు కాపాడుకుంది. ఇందులో ఆస్ట్రేలియాపై రెండు సార్లు స్వల్ప లక్ష్యాన్నిభారత్ రక్షించుకుంది. 1981లో ఎంసీజీలో జరిగిన టెస్టులో , ఆపై 2004 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ తక్కువ లక్ష్యాలను కాపాడుకుని విజయకేతనం ఎగురేసింది. -
'సెలక్టర్ గా చేయాలని ఉంది'
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ క్రికెట్ బోర్డులో కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. తనకు ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్ గా చేయాలని ఉందంటూ మనసులోని బయటపెట్టాడు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా యార్క్‌షైర్‌కు సెలక్షన్ బాధ్యతలను చూసిన గిలెస్పీ.. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాలో సెలక్షర్ పదవిపై మక్కువగా ఉన్నాడు. ఇప్పటికే వచ్చే బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్కు కోచ్ గా వ్యవహరించనున్న గిలెస్పీ.. ఇక ఇంగ్లండ్ వెళ్లే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ కు సెలక్షన్ బాధ్యతలు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. 'యార్క్‌షైర్ నుంచి తప్పుకోవడం చాలా కఠినతో కూడిన నిర్ణయం. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, నా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేశాను. ఆసీస్ చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్‌తో కలిసి పని చేయాలని ఉంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వచ్చే సంవత్సరం జరిగే సెలక్టర్ల నియామకాల్లో తన పేరును బోర్డుకు సూచిస్తానని గిలెస్పీ పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియాలో ఎండకు తట్టుకోలేక..
ఆస్ట్రేలియా: భానుడి భగభగలకు తాల లేకపోతే.. ఏ ఏసీ రూముల్లో దూరిపోతారు. మధ్యతరగతి వర్గం అయితే ఓ కూలర్ పెట్టుకొని సేద తీరుతారు. కానీ, ఏకంగా అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతే. భూమిని అమాంతం త్రవ్వేసి భూగర్భంలో మూడు పడక గదులు నిర్మిస్తే.. అవును ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. ఆస్ట్రేలియాలోని కూబర్ పెడి పట్టణంలో భారీ గుహను తవ్వేసి దీని నిర్మాణం చేపట్టారు. మధ్యాహ్న వేళలు తాళలేక ఎంతోమంది ఇందులోకి వెళ్లి సేద తీరుతుంటారు. నిద్రలో చిన్నప్పుడు వచ్చే మాయా గృహంలో దీని నిర్మాణం ఉంటుంది. ఇందులో ఒక పెద్ద విశ్రాంతి గృహం, కిచెన్, స్నానపు గదులు.. భూమి ఉపరితలంపై ఎలాంటి భవన నిర్మాణం ఉంటుందో అచ్చం అలాగే దీన్ని నిర్మించారు. ఇక్కడ కరెంట్ బిల్లులు కూడా అధికం కావడంతో అంతకంటే తక్కువ ఖర్చుతోనే ఇందులోకి ప్రవేశించి ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నారట. తొలుత 60 ఏళ్ల కిందట ఓ వ్యక్తి ఒక రూమ్ తవ్వి అందులో ఉండటం ప్రారంభించాడు. దాన్ని ప్రస్తుతం కిచెన్ గా ఉపయోగిస్తున్నారు. సాధరణ ఇళ్లకు ప్రవేశ ద్వారాలు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. కొంత నీటి సమస్య ఉన్న కారణంగా దీని ముందు కొంతమేర మాత్రమే గార్డెన్ పెంచగలుగుతున్నారు. ఉపరితలంపై చిన్నచిన్న అద్దాలు పెట్టి ద్వారా లోపలికి వెళుతురు వచ్చే ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ పబ్బుకు వెళితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ నివాసం ఉంది.