స్టీవ్ స్మిత్ ఎమోషనల్ మెసేజ్ | Steve Smith leaves heartwarming message for India as he returns to Australia | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్ ఎమోషనల్ మెసేజ్

Published Mon, Oct 9 2017 11:50 AM | Last Updated on Mon, Oct 9 2017 12:17 PM

Steve Smith leaves heartwarming message for India as he returns to Australia

రాంచీ:టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నాడు. వన్డే సిరీస్ లో ఘోర పరాభవాన్ని, ఆపై తొలి ట్వంటీ 20లో ఓటమిని దగ్గరుండి వీక్షించిన స్మిత్.. ఆస్ట్రేలియాకు పయనమవుతూ ఒక ఉద్వేగభరిత సందేశాన్ని తన  ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

'ప్రస్తుతం వరుస విజయాలతో భారత్ ఆనందంగా ఉంది. భారత పర్యటనలో మాకు నిరాశే మిగిలింది. మా  వన్డే పర్యటన ప్రణాళిక ప్రకారం సాగలేదు. భారత్ పై దారుణ పరాభవం మాకు కొన్ని చేదు జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. మమ్మల్ని దురదృష్టం కూడా వెంటాడింది. నాకు గాయం కావడంతో గత  మ్యాచ్ కు దూరం కావడం ఎక్కువగా బాధించింది. ఇక కొద్ది పాటి విశ్రాంతి తీసుకుంటూ ఆటగాళ్ల పునరావస శిబిరంలో పాల్గొంటూ గాయం నుంచి కోలుకోవడానికి యత్నిస్తా. మిగతా టీ 20ల్లో మా అదృష్టం మారుతుందేమోనని ఆశతో ఎదురుచూస్తూ ఉంటా'అని స్మిత్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement