గువాహటి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా 119 పరుగుల మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి గ్యాంగ్ వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది.జాసన్ బెహ్రెన్ డార్ఫ్ విసిరిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి విరాట్ బంతికి కోహ్లి జాసన్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆపై మనీష్ పాండే, (6), శిఖర్ ధావన్ (2)లను కూడా పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత జట్టు 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కాగా, విరాట్ కోహ్లి ఏది చేసినా రికార్డు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. తన కెరీర్ లో 48వ ట్వంటీ 20 ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ ఫార్మాట్ లో తొలిసారి డకౌట్ గా నిష్క్రమించాడు. తద్వారా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక ఇన్నింగ్స్ లు ఆడిన తరువాత డకౌటైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. టీ 20ల్లో మాలిక్ 40 ఇన్నింగ్స్ లు తరువాత డకౌట్ కాగా, దాన్ని కోహ్లి సవరించాడు. ఇక్కడ యువరాజ్(39), షెన్వారీ(38), మోర్గాన్(35), మెకల్లమ్(33), గ్రేమ్ స్మిత్ (31) తరువాత స్థానల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment