మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు.
కానీ ఫైనల్‌లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
కారా స్విషర్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్‌ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్‌ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్‌మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment