మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్ సీఈఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇదే మొదటిసారి. స్కిల్ యూనివర్సిటీ (Skill University), ఏఐ క్లౌడింగ్ (AI Clouding) కంప్యూటింగ్ వంటి వాటి మీద చర్చలు జరపనున్నారు.
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి.. సత్య నాదెళ్లను కోరనున్నారు. తెలంగాణలో మొత్తం 6 డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ద్వారా 4,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒప్పందాలు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్కిల్ యూనివర్సిటీ
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుమారు 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందులో మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ అండ్ రోబోటిక్స్, ఐవోటీ, ఇండస్ట్రియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటాసైన్స్ అండ్ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ మొదలైన కోర్సులు ఉండనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment