ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ విఫలమైన చోట స్కాటిష్ బౌలర్లను ఇంగ్లిష్ ఊచకోత కోశాడు.
ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లిష్‌కు ఇది రెండో టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న జోష్ 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.
జోష్‌ది బాస్..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లిష్.. తన సొంత రికార్డునే బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లిష్, మాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ పేరిట సంయుక్తంగా ఉండేది.
వీరి ముగ్గురూ 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లిష్.. హెడ్, మాక్సీని అధిగిమించి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. స్కాట్లాండ్‌పై 70 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0తో కంగరూలు కైవసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment