ఆస్ట్రేలియాలో ఎండకు తట్టుకోలేక..
ఆస్ట్రేలియా: భానుడి భగభగలకు తాల లేకపోతే.. ఏ ఏసీ రూముల్లో దూరిపోతారు. మధ్యతరగతి వర్గం అయితే ఓ కూలర్ పెట్టుకొని సేద తీరుతారు. కానీ, ఏకంగా అండర్ గ్రౌండ్కు వెళ్లిపోతే. భూమిని అమాంతం త్రవ్వేసి భూగర్భంలో మూడు పడక గదులు నిర్మిస్తే.. అవును ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. ఆస్ట్రేలియాలోని కూబర్ పెడి పట్టణంలో భారీ గుహను తవ్వేసి దీని నిర్మాణం చేపట్టారు. మధ్యాహ్న వేళలు తాళలేక ఎంతోమంది ఇందులోకి వెళ్లి సేద తీరుతుంటారు.
నిద్రలో చిన్నప్పుడు వచ్చే మాయా గృహంలో దీని నిర్మాణం ఉంటుంది. ఇందులో ఒక పెద్ద విశ్రాంతి గృహం, కిచెన్, స్నానపు గదులు.. భూమి ఉపరితలంపై ఎలాంటి భవన నిర్మాణం ఉంటుందో అచ్చం అలాగే దీన్ని నిర్మించారు. ఇక్కడ కరెంట్ బిల్లులు కూడా అధికం కావడంతో అంతకంటే తక్కువ ఖర్చుతోనే ఇందులోకి ప్రవేశించి ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నారట. తొలుత 60 ఏళ్ల కిందట ఓ వ్యక్తి ఒక రూమ్ తవ్వి అందులో ఉండటం ప్రారంభించాడు. దాన్ని ప్రస్తుతం కిచెన్ గా ఉపయోగిస్తున్నారు.
సాధరణ ఇళ్లకు ప్రవేశ ద్వారాలు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. కొంత నీటి సమస్య ఉన్న కారణంగా దీని ముందు కొంతమేర మాత్రమే గార్డెన్ పెంచగలుగుతున్నారు. ఉపరితలంపై చిన్నచిన్న అద్దాలు పెట్టి ద్వారా లోపలికి వెళుతురు వచ్చే ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ పబ్బుకు వెళితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ నివాసం ఉంది.