sun heat
-
పిల్లల పై వడదెబ్బ ఎలా ప్రభావం చూపిస్తుందంటే..
-
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
ఎండల నుంచి ఉపశమనానికి కుండనీరు శ్రేష్టమంటున్న జనాలు
-
ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్!
సాక్షి, హైదరాబాద్: చండ ప్రచండమైన భానుడి భగభగలతో దేశవ్యాప్తంగా జనం వడ గాల్పుల తాకిడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు ఎన్ని తిరుగుతున్నా ఇళ్లల్లో వేడి భరించలేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఉక్కపోతకు తోడు.. వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లను వినియోగించాలని ఉన్నా.. కరోనా భయంతో వాటికి దూరంగా ఉంటున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో నగర వాసులు.. తమ వేడి బాధను సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వెళ్లక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిల్లో ఒక మీమ్ నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ‘నువ్ సూర్యుడివా యముడివా.. అలా మండుతున్నావ్ ఏంటి.. నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్’అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఫొటోతో ఉన్న మీమ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: ఫీల్.. కూల్) ఎండ తీవ్రత వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి ఈరోజు మరింత ఎక్కువగా ఉంది. నిజామాబాద్ 43, మెదక్ 42, వరంగల్ 44, హైదరాబాద్ 42, కరీంనగర్ 44, రామగుండం 43, నల్గొండ 44, విజయవాడ 42, విశాఖ 34, తిరుపతి 41, రాజమండ్రి 41, ఒంగోలు 42, నెల్లూరు 42, కర్నూలు 41, అనంతపురం 41, కడప 42, ఏలూరు 42, విజయనగరం 36, శ్రీకాకుళం 36 డిగ్రీల చొప్పున శుక్రవారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నేటి ఎండల తీవ్రతను పరిశీలిస్తే.. ఢిల్లీ 45, హైదరాబాద్ 42, అహ్మదాబాద్ 41, చెన్నై 38, పుణె 36, ముంబై 35, కోల్‌కత 34, బెంగుళూరు 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
భానుడి భగభగలకు ఏమయ్యేవారో!
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ వందలాది ప్రాణాలను నిలిపింది. లేదంటే భానుడి భగభగలతో నిప్పుల కుంపటిలా మారిన భారత్‌లో వందలాది మంది పిట్టల్లా రాలిపోయేవారు. దేశవ్యాప్తంగా వడగాడ్పులు, ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్డౌన్ 4.o లో సడలింపులు ఇచ్చినప్పటికీ అధికశాతం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బుధవారం ఎండలు మండిపోయాయి. ఢిల్లీలో 45, హైదరాబాద్ 42, అహ్మదాబాద్ 43, పుణె 37, చెన్నై 37, ముంబూ 34, బెంగుళూరు 32, కోల్‌కత 32 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఉత్తర భారత్‌లోని అనేక అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ 46, బోధన్, 45, జగిత్యాల 46, కొత్తగూడెం 42, మహబూబ్‌నగర్ 43, మంచిర్యాల 44, నిజామాబాద్ 45, కామారెడ్డి 44, కరీంనగర్ 44, మిర్యాలగూడ 46, నిర్మల్ 45, పాల్వంచ 42, వరంగల్ 43 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. అధిక ఎండలు, వడగాల్పులకు జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. -
మరో వేసవి!
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా శ్రావణ మాసంలో.. అందునా శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ రోజుల్లో సూర్యుడు చల్లని చూపులతో.. వరుణుడు చిరుజల్లులతో ఆశీర్వదించడం.. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో పండు గ జరుపుకోవడం ఆనవాయితీ.. కానీ ఈసారి మాత్రం అటు సూరీడు.. ఇటు వరుణుడు.. ఇద్దరూ సిరికన్ను వేశారు. చినుకు జాడ లేకపోగా.. భానుడి తీక్షణతతో నగరం నిప్పుల కొలిమిలా మారింది. గాలి లేక.. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడారు. గురువారం కాసిన ఎండ నడివేసవిని తలపించింది. భానుడి భగభగల ధాటికి నగరవాసుల నాలుక పిడచ కట్టుకుపోయింది. తెల్లవారుజామున కురిసిన చిరుజల్లులు, ఆపై మబ్బుల వాతావరణం కొద్దిసేపట్లోనే మాయమయ్యాయి. ఆ తర్వాత నుంచి సాయంత్రం వరకు నగర ప్రజలకు సూర్యుడు చుక్కలు చూపించాడు. వానాకాలంలో నగరం నిప్పుల కుంపటిలా మారిపోయింది. మే నెలను తలపిస్తూ ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం, చిరు జల్లులతో కాసింత ఊరట చెందిన నగరవాసులు.. గురువారం ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోయారు. గాలి కూడా లేకపోవడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక జనం సతమతమయ్యారు. వాహనదారులు, ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఎండ కారణంగా దాహార్తి పెరగడం.. ఎక్కడా చలివేంద్రాలు లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సరైన వానలు కురవకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం పెరగడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే వేడికి ప్రధాన కారణమని వెల్లడించారు. నగరంలో గురువారం 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒకట్రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
హడలెత్తిస్తున్న ఎండలు
పర్లాకిమిడి : జిల్లాలో ఎండలు మండుతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో జిల్లాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుమ్మ, మోహనా రోడ్లపై పిట్టమనిషి కూడా కనిపించడంలేదు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావడంలేదు. పర్లాకిమిడిలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఇంతలా ఎండలు ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎండలు అధికంగా ఉండడంతో భవన నిర్మాణ కార్మికుల ఉదయం 11 గంటలకే పనులు నిలిపివేసి మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తున్నారు. అలాగే ఉపాధి కార్మికులు ఉదయం 10 గంటల వరకు పనులు చేసి మళ్లీ సాయంత్రం చేయాలని జిల్లా ఉపాధి శాఖ అధికారి పి.వేణుగోపాలరావు స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఉపాధి కార్మికులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చిన వారికి తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో కూల్ డ్రింకులు, చెరుకు రసం తదితర పానీయాలపై ఆధారపడుతున్నారు. దీంతో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, మార్కెట్, పోలీస్‌స్టేషన్ తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాయంతో ఉపశమనం..
భానుడు భగభగ మండిపోతున్నాడు.. పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాలంటే హడలిపోవాల్సిందే. కూసుమంచి మండలానికి చెందిన బానోత్ రాందాసు అనే వ్యక్తికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఇలా బండికి గొడుగు అమర్చుకున్నాడు. ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నాడు. – ఖమ్మంఅర్బన్ -
బడభాగ్ని
నెల్లూరు(పొగతోట) : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న మొన్నటి వరకు చలి, మంచు ప్రభావంతో పెద్దగా ఎండ తీవ్రత అనిపించలేదు. ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల దృష్ట్యా 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడంతో ఎండకు, ఉక్కపోతకు ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. రాబోయే వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి. గతేడాది ఏప్రిల్ 17వ తేదీ 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే 2018 ఏప్రిల్ 17వ తేదీ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమయ్యాయి. రాబోయే వారం రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రభావం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బయపడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థలు వినియోగదారులు రాకపోవడంతో బేరాలు లేక ఎదురు చూపులు చూస్తున్నారు. సినిమా థియేటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడంలేదు. సాయంత్రం 6.30 గంటల తర్వాత చల్లగాలు వీస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. నగరంలో 38.5 డిగ్రీలు నమోదైతే ఉదయగిరి ప్రాంతంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల నివారణ సంస్థ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే కానీ బయటకు రావదంటున్నారు. ఉదయం 9 సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగా అధికంగా తీసుకోవాలంటున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా గొడుగు వేసుకోవాలంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఎండ.. ప్రచండ
తణుకు : ఎండలు మండుతున్నాయి.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజుల క్రితం వరకు చల్లబడిన వాతావరణం రెండురోజులుగా వేడెక్కింది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గకపోగా వడగాలులు వీస్తున్నాయి. మంగళవారం జిల్లాలో గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలోని మార్పులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలను దాటేసిన ఉష్ణోగ్రతలు జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండుఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఎండవేడిమిని భరించలేకపోతున్నారు. గత రెండు మూడురోజుల క్రితం వరకు అకాలవర్షంతో జిల్లాలో కొన్నిచోట్ల చల్లబడినా మంగళవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గంట గంటకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లాలోని మంగళవారం ఏలూరులో 42, తాడేపల్లిగూడెంలో 41, తణుకులో 40, భీమవరం 39, నరసాపురం 36, కొవ్వూరు 42, జంగారెడ్డిగూడెం 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా పట్టణాల్లో ప్రధాన రహదారులన్నీ కూడా జనం లేక బోసిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్లనుంచి బయటకు వచ్చేవారు ఎండవేడిమి తట్టుకునేందుకు గొడుగులు, చేతిరుమాళ్లు, టోపీలు, స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడిమి తగ్గకపోగా వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారులు, కూలీనాలీ చేసుకుని జీవించేవారు, రిక్షా కార్మికులు ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు ఎండకు వినియోగదారులు రావడంలేదని వ్యాపార లావాదేవీలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు గతంలో కూలర్లు, ఫ్యాన్లతో సరిపెట్టుకునేవారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎండవేడిమిని భరించలేక ఏసీలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. గతేడాది 35 మంది మృతి ఈ ఏడాది కూడా జిల్లాలో వడదెబ్బ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఐఎండీ హెచ్చరిస్తున్నారు. గతేడాది వడదెబ్బ కారణంగా జిల్లాలో 35 మంది మృతి చెందారు. అయితే ఈ ఏడాది ఎండవల్ల వడదెబ్బ బాధితులతో పాటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భానుడి ప్రకోపానికి తట్టుకునేలా జనాలు నిలబడాలంటే వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఓ వైపు అకాలవర్షాల కారణంగా రాత్రి వేళల్లో చల్లటి గాలులు, ఉదయం, మధ్యాహ్నం ఎండల తీవ్రత అధికమవుతుండటం ఆరోగ్యానికి మంచిదికాదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. గత మార్చి నెలలో ఎండల తీవ్రత అధికమవుతున్న సమయంలో అకాల వర్షాల కారణంగా గడిచిన పదిహేను రోజుల్లో వాతావరణం చల్లబడినా మళ్లీ రెండ్రోజులుగా పుంజుకుంటోంది. -
9రోజులకే కోడిపిల్ల జననం!
ఎండ తీవ్రతే కారణం నారాయణపేట : ఓ కోడి తనగుడ్లను పొదిగే క్రమంలో 9రోజులకే ఓ గుడ్డును చీల్చుకుని కోడిపిల్ల బయటికి వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. ఎండవేడిమి వల్లే పొదిగే సమ యం పూర్తికాకుండానే ఇలా కోడిపిల్ల బయటపడి ఉంటుందని స్థానికులు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం అన్పూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజు ఇంట్లో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ప్రస్తుతం ఆ కోడిపిల్లను గ్రామస్తులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో ఎండకు తట్టుకోలేక..
ఆస్ట్రేలియా: భానుడి భగభగలకు తాల లేకపోతే.. ఏ ఏసీ రూముల్లో దూరిపోతారు. మధ్యతరగతి వర్గం అయితే ఓ కూలర్ పెట్టుకొని సేద తీరుతారు. కానీ, ఏకంగా అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతే. భూమిని అమాంతం త్రవ్వేసి భూగర్భంలో మూడు పడక గదులు నిర్మిస్తే.. అవును ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. ఆస్ట్రేలియాలోని కూబర్ పెడి పట్టణంలో భారీ గుహను తవ్వేసి దీని నిర్మాణం చేపట్టారు. మధ్యాహ్న వేళలు తాళలేక ఎంతోమంది ఇందులోకి వెళ్లి సేద తీరుతుంటారు. నిద్రలో చిన్నప్పుడు వచ్చే మాయా గృహంలో దీని నిర్మాణం ఉంటుంది. ఇందులో ఒక పెద్ద విశ్రాంతి గృహం, కిచెన్, స్నానపు గదులు.. భూమి ఉపరితలంపై ఎలాంటి భవన నిర్మాణం ఉంటుందో అచ్చం అలాగే దీన్ని నిర్మించారు. ఇక్కడ కరెంట్ బిల్లులు కూడా అధికం కావడంతో అంతకంటే తక్కువ ఖర్చుతోనే ఇందులోకి ప్రవేశించి ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నారట. తొలుత 60 ఏళ్ల కిందట ఓ వ్యక్తి ఒక రూమ్ తవ్వి అందులో ఉండటం ప్రారంభించాడు. దాన్ని ప్రస్తుతం కిచెన్ గా ఉపయోగిస్తున్నారు. సాధరణ ఇళ్లకు ప్రవేశ ద్వారాలు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. కొంత నీటి సమస్య ఉన్న కారణంగా దీని ముందు కొంతమేర మాత్రమే గార్డెన్ పెంచగలుగుతున్నారు. ఉపరితలంపై చిన్నచిన్న అద్దాలు పెట్టి ద్వారా లోపలికి వెళుతురు వచ్చే ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ పబ్బుకు వెళితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ నివాసం ఉంది. -
వడదెబ్బతో 15మంది మృతి
సాక్షి నెట్వర్క్: జిల్లాలో ఎండ వేడిమి తట్టుకోలేక శనివారం పదకొండు మంది మృతిచెందారు. శుక్రవారం రాత్రి నలుగురు మరణించారు. పుత్తూరు మండలంలో చెరువురాజుపాళెం పంచాయతీ దిగవగుళ్లూరుకు చెందిన కే గురవమ్మ (55), తిరుమలకుప్పం దళితవాడకు చెందిన పద్మావతి (75), తడుకు పంచాయతీ విద్యుత్ సదాశివపురం గ్రామానికి చంద్రయ్య (45)వడదెబ్బతో శనివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పల్లమాల గ్రామానికి చెందిన పల్లమాల పోలమ్మ (45), వేణుగోపాలపురం పంచాయితీ పరిధిలోని కుమ్మర వెంకటాపురం గ్రామానికి చెందిన ధరాచెంగమ్మ (55), నారాయణవనం మండలంలోని అరణ్యంకండ్రిగ పంచాయతీ చిత్తూరు కండ్రిగ ఆదిఆంధ్రవాడకు చెందిన చంద్రయ్య(47), పిచ్చాటూరు వుండలంలోని కారూరు హరిజనవాడకు చెందిన ఇందిర(28), నగరి మండలం దామరపాకం గ్రామానికి చెందిన జాంబవతి (62), శ్రీకాళహస్తి పట్టణంలోని 14వవార్డుకు చెందిన శ్రీనివాసులు(65), శ్రీకాళహస్తి మండలంలోని మాధవిగిరి పల్లెకు చెందిన నర్సవ్ము(76), చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ఏ.నారాయణ(66) శనివారం వడదెబ్బ సోకడంతో మృతిచెందారు తరలించేలోపు మృతి చెందారు. మదనపల్లె పట్టణంలోని గాంధీపురానికి చెందిన గాయత్రి(20, శ్రీరంగరాజపురం మండలంలోని కటికపల్లె పంచాయతీ పరిధిలోని కనికాపురం గ్రామానికి చెందిన కే.వసంతమ్మ(55), వరదయ్యపాళెం హైస్కూల్ గిరిజన కాలనీకి చెందిన టి.రావుయ్యు (57), బెరైడ్డిపల్లె మండలంలోని వెంగంవారిపల్లె గ్రామానికి చెందిన సత్తార్‌సాబ్(70) వడదెబ్బతో శుక్రవారం రాత్రి మరణించారు. -
ఎండవేడిమికి సింహం మృతి!
తిరుపతి: ఎండల తీవ్రతకు జంతువులూ విలవిలలాడిపోతున్నాయి. వడగాల్పుల ప్రభావం వల్ల జంతువులు మృత్యువాతపడుతున్నాయి. ఎండవేడిమికి తాళలేక తిరుపతి జూలో సింహం మరణించినట్టు సమాచారం. కాగా వయస్సు పైబడటం వల్లే సింహం మృతి చెందినట్టు జూ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఎండల తీవ్రతకు నామాలకోడితోపాటు రెండు జింకలు చనిపోయాయి. -
ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు
వరంగల్: అబ్బా ఎండలు మండిపోతున్నాయి.. నేలపై అడుగుపెడితే కాలిపోతోంది.. ఈ వేడికి ఆమ్లెట్ వేసుకోవచ్చు అని ఎండల తీవ్రతను చెబుతూ మాట్లాడుకొంటుంటారు. వరంగల్ జిల్లాలో నిజంగానే ఎండ వేడిమితో ఆమ్లెట్ వేశారు. తెలుగు ప్రజలు ఎండల తీవ్రతకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎండ వేడితో ఆమ్లెట్ అవుతుందా లేదా అనే కుతూహలంతో మహబూబా బాద్ వాసులు ప్రయత్నించారు. ఎండలో పెనం (పెంక)ను కొద్దిసేపు ఉంచగా, అది వేడెక్కింది. కోడి గుడ్డు పగలగొట్టి దానిపై వేయడంతో ఆమ్లెట్‌గా మారింది. ఓ వైపు ఎండల తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతూనే ఈ చిత్రమైన ఘటనను ఆసక్తిగా తిలకించారు.