ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు | omelet made in sun heat | Sakshi
Sakshi News home page

ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు

Published Sun, May 24 2015 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు

ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు

వరంగల్: అబ్బా ఎండలు మండిపోతున్నాయి.. నేలపై అడుగుపెడితే కాలిపోతోంది.. ఈ వేడికి ఆమ్లెట్ వేసుకోవచ్చు అని ఎండల తీవ్రతను చెబుతూ మాట్లాడుకొంటుంటారు. వరంగల్ జిల్లాలో నిజంగానే ఎండ వేడిమితో ఆమ్లెట్ వేశారు.

తెలుగు ప్రజలు ఎండల తీవ్రతకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎండ వేడితో ఆమ్లెట్ అవుతుందా లేదా అనే కుతూహలంతో మహబూబా బాద్ వాసులు ప్రయత్నించారు. ఎండలో పెనం (పెంక)ను కొద్దిసేపు ఉంచగా, అది వేడెక్కింది. కోడి గుడ్డు పగలగొట్టి దానిపై వేయడంతో ఆమ్లెట్గా మారింది. ఓ వైపు ఎండల తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతూనే ఈ చిత్రమైన ఘటనను ఆసక్తిగా తిలకించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement