Happy Birthday Virat Kohli:Mohammed Siraj Special wishes - Sakshi
Sakshi News home page

Happy Birthday Virat Kohli: వీడియోతో ఫిదా చేసిన సిరాజ్‌

Published Fri, Nov 5 2021 11:04 AM | Last Updated on Fri, Nov 5 2021 11:54 AM

Happy Birthday Virat Kohli:Mohammed Siraj Special wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరుగుల వీరుడు, టీమిండియా కెప్టెన్  విరాట్‌ కోహ్లీ 33వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అటు అభిమానులు, ఇటు సహచర ఆటగాళ్లు  కోహ్లీకి శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఆర్‌సీబీ సహ ఆటగాడు  మహ్మద్ సిరాజ్  ఒక వీడియోద్వారా విరాట్‌కు సర్‌ప్రైజ్‌  విషెస్‌ అందించాడు. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే అంటూ ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

మరోవైపు టీ20 ప్రపంచ కప్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీకి  పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలుపుతున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్,  బీసీసీఐ, ఐసీసీ, యూసుఫ్ పఠాన్, అజింక్యా రహానే , వసీం జాఫర్‌ తదితరులు శుభాకాంక్షలు  తెలిపారు. దుబాయ్‌లో  నేడు(శుక్రవారం)  కీలకమై పోటీ జరగనుంది. సూపర్ 12 పోరులో మెన్ ఇన్ బ్లూ స్కాట్లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో  ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కోహ్లీ సేన  కసరత్తు చేస్తోంది.

కాగా 1988 నవంబర్‌ 5 వ తేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్‌ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా సారధిగా ఎదిగాడు. 2008లో అరంగేట్రం  చేసిన కోహ్లీ  అనేక రికార్డులను నమోదు చేశాడు. టెస్టుల నుంచి వన్డే, టీ2 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement