ముంబై: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సహచర క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. తన క్రికెట్ కెరీర్‌లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగే అని కితాబిచ్చాడు. భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో కలసి ఎన్నో మ్యాచ్‌ల్లో ఆడిన గంగూలీ... తన తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా మాత్రం వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకున్నాడు.
‘ఓపెనర్‌గా సెహ్వాగ్ మా కాలంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్. అతడిని ఓపెనర్‌గా బరిలోకి దిగమని చెప్పింది నేనే. అలాగే జట్టు కోసం అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగడానికి సన్నద్ధంగా ఉండాలని సైతం చెప్పాను. వన్డేల్లో నాలుగు, ఐదు స్థానాల్లో నేను బ్యాటింగ్ చేస్తే పూర్తిగా రాణించలేను. సచిన్ కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తే ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న పరుగుల్లో సగమే చేసేవాడేమో. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సెహ్వాగ్‌ను బ్యాటింగ్ చేయమని చెప్పా. ఆ నిర్ణయం సెహ్వాగ్‌కు టీమిండియాకు ఎంతో లాభించింది’అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment