
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్నామని ఎవరైనా వేడుకుంటే వెంటనే స్పందిస్తుంటారు. సమస్యలు తెలుసుకొని వారికి కావ్సాలిన సాయాన్ని అందిస్తారు. ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి షిషయంలో తక్షణం రెస్పాండ్ అవుతారు. అలాగే నెటిజన్ల అడిగే పలు ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తుంటారు.
చదవండి: MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్ విఫలయత్నం.. ‘విత్‌డ్రా’మా.. వివాదం
ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ కృష్ణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్, షారుక్ ఖాన్, సచిన్‌లో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఇందులో ముగ్గురు వరుసగా సెల్ఫీకి పొజిచ్చారు. అయితే ఇది ఎప్పుడు దిగారో తెలియదు కానీ దీనిని పోస్టు చేస్తూ.. ‘పాత ఫోటో, ముగ్గురు స్టార్స్’ అంటూ పేర్కొన్నారు.
దీనిపై కేటీఆర్ స్పందించారు. నాకు ఇష్టమైన ఫోటోల్లో ఇది ఒకటి అంటూ రీట్వీట్ చేశారు. కాగా దీనిపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. ‘సూపర్ ఫోటో. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు లెజెండ్‌లు అంటూ కామెంట్‌చేస్తున్నారు. ముగ్గురిలో షారుక్, సచిన్ కంటే, కేటీఆర్ యంగ్‌గా కనిపిస్తున్నారు’ అన ప్రశంసిస్తున్నారు.
చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
One of my favourite pic https://t.co/94YohQ1A8R
— KTR (@KTRTRS) November 26, 2021