ఇంటర్నెట్ వాడకం పెరగడంతో కొందరు ఈజీ మనీ కోసం ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. వీళ్లు తమ దందా సాఫీగా సాగించేందుకు కొత్త దారులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జాబితాలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైతం సైబర్ మోసానికి గురయ్యాడు.
వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు కాంబ్లీ కి ఫోన్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆయన కేవైసీ సమాచారాన్ని సమర్పించాలని లేదా తను బ్యాంక్ ఖాతా రద్దు అవుతుందని తెలిపారు. వాళ్ల మాటలను నమ్మిన కాంబ్లీ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు తన ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. దెబ్బకు కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయ్యాయి. ఈ తతంగమంతా కూడా కాంబ్లీ అతనితో ఫోన్‌లో మాట్లాడుతుండగానే జరిగింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన కాంబ్లీ అసలు విషయం తెలుసుకుని దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్ ట్రాన్సక్షన్ ద్వారా కాంబ్లీ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోకి జమచేశారు. కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి చదువుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరు భారత క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత కాంబ్లీ మాత్రం పలు వివాదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.
చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విఛ్చాఫ్.. ఏమైందో నాకు తెలియదు"
Comments
Please login to add a commentAdd a comment