
వెల్లింగ్టన్: 2016 ఐపీఎల్ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెకల్లమ్ స్వయంగా వెల్లడించాడు. అయితే అతను తాను వాడిన ఉత్ప్రేరకం విషయంలో మినహాయింపు ఉన్నట్లుగా ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం తప్పించుకున్నట్లు స్పష్టం చేశాడు.
2016లో భారత్‌లో ఒక ప్రముఖ ఆటగాడు డోప్ పరీక్షలో విఫలమైనట్లుగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పేర్కొంది. అయితే అతను ఎవరన్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్పట్లో దాచి పెట్టింది. దీనిపై ఇప్పుడు మెక్‌కలమే స్వయంగా తాను డోపీగా దొరికిన విషయాన్ని పేర్కొన్నాడు. ‘ఆ సమయంలో ఇన్‌హేలర్ అతిగా వాడాను. బీసీసీఐ నాకు సహకరించింది’ అని మెక్‌కలమ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం గుజరాత్ లయన్స్ తరపున ఆడినప్పుడు ఆస్తమా బాధితుడైన మెకల్లమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో ఎప్పుడూ వాడే ఇన్‌హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట. దీని ఫలితంగా డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడట. దీనిపై బీసీసీఐ అతడిని వివరణ కోరగా.. స్వీడన్‌కు చెందిన వైద్య నిపుణుల నుంచి ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం నుంచి బయటపడినట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment