సిక్స్ లు: 580, వికెట్లు: 606
క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొమ్మిదో సీజన్ లీగ్ మ్యాచ్ లు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 24 నుంచి తుది పోటీలకు తెర లేస్తుంది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. ఎప్పటిలానే ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.
ఈ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించి టాప్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. 919 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 658 పరుగులు చేశాడు. డివిలియర్స్(603 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు టీమ్ కే చెందిన యజువేంద్ర చాహల్ 19 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఆర్సీబీ 144 పరుగులతో గుజరాత్ పై బిగ్గెస్ట్ విన్ సాధించింది. సెకండ్ బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించి అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఇలాంటి విశేషాలు ఐపీఎల్-9 లీగ్ మ్యాచుల్లో చాలానే ఉన్నాయి.
మొత్తం పరుగులు: 17,510
బౌండరీలతో వచ్చిన పరుగులు: 9552
అర్థసెంచరీలు: 103
వికెట్లు: 606
సిక్స్ లు: 580
అత్యధిక సిక్సర్లు: 36(కోహ్లి)
లాంగెస్ట్ సిక్స్: 111
హయ్యస్ట్ టీమ్ స్కోరు: 248/3(బెంగళూరు)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129(డివిలియర్స్)
బెస్ట్ బౌలింగ్: 6/19(ఆడమ్ జంపా)
ఫాస్టెస్ట్ బాల్: 150. 02
హ్యాట్రిక్: ఒకటి (అక్షర్ పటేల్-పంజాబ్)
బెస్ట్ ఎకానమీ: 5.00(మిచెల్ మార్ష్)
లీగ్ మ్యాచుల్లో సూపర్ ఓవర్లు నమోదు కాలేదు