బెంగళూరు టాప్!
బెంగళూరు: ఐపీఎల్-9లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. ఫైనల్లోకి దూసుకెళ్లిన కోహ్లి టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆరంభంలో కాస్త వెనకబడినా తర్వాత పుంజుకుని ఫైనల్ చేరింది. ముఖ్యంగా కోహ్లి అద్భుతంగా ఆడుతూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. విధ్వంసకర ఆటగాళ్లు డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ అండదండలతో ఆర్సీబీని టైటిల్ కు చేరువ చేశాడు.
ఈ ఐపీఎల్ లో అన్ని విభాగాల్లోనూ ఆర్సీబీ ఆటగాళ్లే ముందుడడం ఆ జట్టు సత్తాను వెల్లడిస్తోంది. కోహ్లి అత్యధిక వ్యక్తిగత పరుగులు(919)తో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా, వాట్సన్ అత్యధిక వికెట్లు(20) పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరో బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా 20 వికెట్లు తీశాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అత్యధిక సిక్సర్లు, అత్యధిక ఫోర్లు, హయ్యస్ట్ స్కోరు, అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఎక్కువ సెంచరీలు సాధించారు. అందరికంటే ఎక్కువగా కోహ్లియే ఎక్కువ విభాగాల్లో టాప్ లో ఉన్నాడు. ఫెయిర్ ప్లే అవార్డు రేసులోనూ ఆర్సీబీ ముందుంది.
అత్యధిక సెంచరీలు: విరాట్ కోహ్లి(4)
అత్యధిక సిక్సర్లు: డివిలియర్స్(37)
అత్యధిక ఫోర్లు: విరాట్ కోహ్లి(78)
హయ్యస్ట్ టీమ్ స్కోరు: 248/3(బెంగళూరు)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129(డివిలియర్స్)
అత్యంత విలువైన ఆటగాడు: విరాట్ కోహ్లి(334.5)