ధోనీ షాకిచ్చాడు...!
ఆకస్మికంగా టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు దిమ్మతిరిగేలా చేశాడు. ఇంత సడెన్‌గా ధోనీ ప్రకటించిన ఈ నిర్ణయం ఇటు అభిమానులనే కాదు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని కూడా కలవర పరిచింది. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రవిశాస్త్రి.. టెస్టుల నుంచి ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆశ్చర్యపరచడమే కాదు షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. 'నేను షాక్ తిన్నాను. మూడు ఫార్మెట్లలోనూ కొనసాగే సత్తా ధోనీలో ఉంది' అని శాస్త్రి చెప్పాడు.
మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ అయిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టుకు డైరెక్టర్‌గా విశేషమైన సేవలందించారు. ఇటీవలికాలంలో ధోనీ సేన మళ్లీ విజయాల బాటపట్టడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ను వచ్చే ఏడాది విదేశాల్లో నిర్వహించనున్నారన్న కథనాలపై స్పందిస్తూ.. 'ఐపీఎల్ గ్లోబల్ ప్రాడక్ట్. దానిని ఎక్కడైనా నిర్వహించవచ్చు. విదేశాల్లో నిర్వహించకూడదనానికి ఎలాంటి కారణాలే లేవు' అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఇండస్ట్రీ లాంటిదని, దీనివల్ల హోటళ్లు, విమాన సంస్థలు నడుస్తాయని, వేలసంఖ్యలో ఉద్యోగులు వస్తాయని ఆయన చెప్పారు.