కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి మరోసారి మద్దతు ప్రకటించారు. ధోనీలో టీ-20 క్రికెట్ ఆడే సత్తా లేదని, అతను రిటైర్ కావాలని కొందరు మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై రవిశాస్త్ర మరోసారి స్పందించారు. ధోనీని విమర్శించేవారు.. ముందు తమ కెరీర్ ఎంటో చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు. టీ-20 క్రికెట్‌లో ధోనీ భవితవ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతూ వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వంటి క్రికెటర్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
’ధోనీ మీద వ్యాఖ్యలు చేసేవాళ్లు.. ముందు తమ కెరీర్ ఎంటో చూసుకోవాలి. మాజీ కెప్టెన్ ధోనీలో ఇంకా ఎంతో క్రికెట్ ఉంది. ఆ లెజెండ్‌కు మద్దతు నిలువాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని రవిశాస్త్రి తాజాగా కోల్‌కతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఆటతీరు, సమానత్వం అనే సంస్కృతి నెలకొని ఉందని అన్నారు. వికెట్ కీపింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ, ప్రసెన్స్ ఆఫ్ మైండ్, షార్ప్‌నెస్‌లోనూ ధోనీని మించినవాళ్లు మైదానంలో ఎవరూ ఉండరని అన్నారు. ధోనీని విమర్శించేవారంతా అసూయపరులేనని, ధోనీ కెరీర్‌ను నాశనం చేసేందుకే వారు విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment