ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్‌కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.
ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.
ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్‌లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్‌లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్‌లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్‌లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment