పుణే : ఐపీఎల్ సీజన్ 11 లో సెంచరీ చేసిన రెండో ఆటగాడు షేన్‌వాట్సన్ క్రిస్‌గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆసీస్ ఆల్ రౌండర్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. సెంచరీల మోత మోగించే క్రిస్‌గేల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ 20 ఆటగాడని కీర్తించాడు. టీ 20ల్లో అధిక సెంచరీలు చేయగలిగే ప్రతిభ క్రిస్‌గేల్ సొంతమని కొనియాడాడు. ఆ కారణంగానే గేల్‌ను యూనివర్స్ బాస్ అంటారంటూ ప్రశంసలు కురిపించాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సీఎస్‌కే జట్టులో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వాట్సన్ పేర్కొన్నాడు. రాత్రి జరిగిన మ్యాచులో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచులో 57 బంతుల్లో 106 పరుగులు చేసిన వాట్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌లో క్రిస్‌గేల్ తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్‌గేల్.. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment