ట్విటర్ మాజీ ఉద్యోగిని ఎస్తేర్ క్రాఫోర్డ్.. ఈమె పేరు చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. క్రాఫోర్డ్ ట్విటర్‌లో పనిచేస్తున్నప్పుడు రాత్రిళ్లు అక్కడే ఆఫీస్‌లోనే నిద్రిస్తున్న ఫొటో గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన తెలిసిందే.
ప్రొడక్ట్ మేనేజర్‌గా అంతలా కష్టపడి పనిచేసినా ఆమెను ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కనికరించలేదు. ట్విటర్ గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఇదంతా తెలిసిందే. అయితే ఐదు నెలల తర్వాత ఆమె మస్క్‌తో పనిచేయడం ఎలా ఉంది, ఆయన అసాధారణ ప్రవర్తన ఉద్యోగులను ఎలా భయపెట్టేది తదితర ఆసక్తికర విషయాలు తెలియశారు.
ఎలాన్ మస్క్ ఆధీనంలో లేక ముందు ఇతర కంపెనీల మాదిరిగానే ట్విటర్ కూడా చాలా బాగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం పని చేస్తేనే సరిపోదు.. రాజకీయాలు కూడా చేస్తేనే రాణిస్తారంటూ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవల ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌లో రాశారు.
అపరిచితుడు!
ఇక ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేయడం గురించి వివరిస్తూ.. “వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్ చాలా అసాధారణంగా ఉంటాడు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు. చెప్పన కథలు, జోకులే పదే పదే చెప్తాడు” అని పేర్కొంది. ఇక ఉద్యోగులు ఎదుర్కొన్న సవాలు ఏమిటంటే, మస్క్ ఉత్సాహంగా ఉన్న బాస్ నుంచి క్షణాల్లో కోపంగా మారిపోతాడని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి ➤ 'X' Replacing Twitter Blue Bird Logo: పిట్ట పోయి ‘ఎక్స్’ వచ్చె.. మారిపోయిన ట్విటర్ లోగో
"అతను ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉంటాడో, ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. దీంతో మీటింగ్‌కి పిలిచినప్పుడల్లా ఉద్యోగులు భయపడేవారు. ఆయనతో ప్రతికూల విషయాలను చర్చించడానికి సంశయించేవారు" అని క్రాఫోర్డ్ పేర్కొన్నారు.
కాగా 2022 నవంబర్‌లో ట్విటర్ భారీ తొలగింపులు చేపట్టిన సమయంలో ఎస్తేర్ క్రాఫోర్డ్.. తాను ఆ కంపెనీలో ఉన్నందుకు సంతోషిస్తున్నానంటూ మస్క్ ఆలోచనలను సమర్థించడంపై సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment